3, నవంబర్ 2008, సోమవారం

ఒంటరిని చేసావు

నీవు దూరమైన ,నన్ను దూరం చేసుకున్నా
నీపై అభిమానం ,నన్ను నీ దగ్గరే ఉంచింది
ఆనందాన్ని పంచి ,అభిమాన్నాన్ని చూపి
ఆపై నీ ప్రేమలో నన్ను మరిపించి
జంటగా మారి జోరుగా కాపురమే చేద్దామని
జీవితం లో నన్ను చూడనని
ఒక్కసారిగా నన్ను ఒంటరిని చేసావు

ఏదో పరవశం

నిన్ను తాకిన చిరు గాలి
నన్ను చేరగానే చిరుకోపం
తన్నుకు పోయింది
ఆనందాన్ని అందించి
అలసటను తీర్చింది
నీతో ఉన్నఈ క్షణం
నాలో ఏదో పరవశం

మిగిలేది శూన్యం

నయ వంచన చేసి
నన్ను వదిలి వెళ్ళావు
నిన్నే నమ్ముకుని
నేను మోస పోయాను
ఎవ్వరికి చోటివ్వనని
నీకు మాట ఇచ్చాను
ఎన్నటికి నిను వీడనని
నీతో బాస చేశాను
ఇక నుండి ఒంటరిదే ఈ జీవితం
ఇక నా గుండెల్లో మిగిలేది శూన్యం

నన్ను చంపు

ఇన్నాళ్ళు నిన్ను దాచిన నా హృదయం
ఇక నీవు తనలో లేవని
ఎప్పటికి తిరిగి రావేమోనని
ఎదురుచుడలేక
ఎప్పుడు ఆగిపోతుందో ఏమో ?
కరుణించి నను కాపాడు
కాదంటే నీవే నన్ను చంపు

2, నవంబర్ 2008, ఆదివారం

వదిలి ఎందుకు వెళ్ళావు?

అందించి చేతిని అందలం ఎక్కిన్చినావు
ఆనందం పంచి ఆయుషుపెంచావు
ఇది కాదు ప్రేమని ఇరువురం ఒక్కటి కావాలన్నావు
ఈడు జోడు కుదిరిందని ఈల వేసి గోల గోల చేసావు
ఉన్నది నీకోసమే నని ఉన్నంత కాలం నీ దాన్నే నన్నావు
ఊఁసులెన్నో చెప్పి ఊపిరిని పోసావు
ఎన్ని జన్మలైనా నిను వీడనని ఎందుకు నాకు దూరం అయ్యావు?
ఏలిన వాన్నినన్ను వదిలి ఏటికి ఎందుకు వెళ్ళావు?

మీ కోసమే

స్వాగతం తెలుగు నచ్చే వాళ్ళకి ,
అందరు కోరే ప్రేమ ఎప్పటికి దూరమే
నిన్ను కోరే ప్రేమ ఎప్పటికి భారమే
దూర భారాలను ఏకం చేసే బంధంపెళ్లి

ప్రేమ అంటే ఇద్నెఅ

నాకు ఉన్నా ఆశ నీవు నా దానివి కావాలని
మరి ఎందుకు ఆ దేవుడు నన్ను నీకు దూరం చేసాడు
దేవునికి తెలియదా ప్రేమంటే
తెలిసి ఎందుకు కలిగించాడు ప్రేమ అనే అను భావాన్ని