10, ఫిబ్రవరి 2010, బుధవారం

తెలంగాణా రాజకీయాలు

తెలంగాణా రాజకీయాలు

తెలంగాణా ఉద్యమం ఘన చరిత్ర సృష్టించడానికి జరుగుతుందా? తెలంగాణా రాష్ట్ర సాధన కోసం జరుగుతుందా? ఐక్య కార్యాచరణ సమితి అంటే అంత ఐక్యంగా ఉండడమే కదా? అలాంటప్పుడు మల్లి ఇందులో విభజించబడిన ఐక్యత ఎందుకు ? రేపు తెలంగాణా వస్తే కూడా ఉండేది ఇదేనా?ఇప్పుడే సమయం దొరికినాటు కొంత మంది అప్పుడే కులమతాల గురించి సభాముఖంగా తగువులాడుతున్నారు."ఆలు లేదు చులు లేదు కొడుకు పేరు సోమలింగం లా ఉంది పరిస్థితి." ఎవరికీ వారు ఐక్య కార్యాచరణ సమితి అంటున్నారు కాని ఐక్యత మాత్రం లేదు.అసలు ఇలా ఎవరికీ వారు ఐక్య కార్యాచరణ సమితి స్థాపించడం ఎందుకో ? కార్యం సాధించడానికా లేక మరి దేనికోసం?

అటు సీమంధ్ర వాళ్ళు ఇంకా ఏదో చేద్దామని పరుగులు తీస్తున్నారు ఎందుకో? చరిత్రను పట్టుకుని వేలాడుతున్నామని నిదించినా,భవిష్యత్తు కి నమ్మకం ,ఆశ, స్థైర్యం లేదనే తెలంగాణా ఉద్యమం జరుగుతుంది. ఇన్నాళ్ళు జరగనిది ఇక ముందు ఎలా జరుగుతుంది అనే ఈ ఉద్యమం .ఈ ఉద్యమం లో సమిధలైన విద్యార్థులు కోసం అయినా సీమాంధ్రులు మారుతార? మారారు. రాజీనామా చేస్తే తెలంగాణా వస్తుంది రాజీనామా చేయమంటే ,రాజకేయ సంక్షోభం వస్తుంది,ప్రభుత్వం పడిపోద్ది,రాష్ట్ర పతి పాలన వస్తది అని అంటున్నారు .రాజకీయ నాయకులు.మరి ఈ విషయం ఇంతకు ముందు రాజీనామా చేసినప్పుడు తెలియడ? తెల్నగన రాజకీయ నాయకులు రాజీనామా చేస్తే ,రాజకీయ సంక్షోభం వచ్చి ,రాష్ట్ర పతి పాలనకి దారి తీస్తే మరి ఇది సీమంధ్ర రాజకీయ నాయకులకు వర్తించద?
గోడ మీద పిల్లి ల వ్యవహరిస్తున్న పార్టీలు ,కేంద్రం విద్యార్థులు జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఈ బలిదానాలు కొంత మంది సీమంధ్ర పాలకులకు క్రికెట్టు స్కోఋ లా కనిపిస్తున్నాయి . ఆత్మ హత్యా చేసుకుంటే అదేమైనా గొప్ప ?అని అడిగే సీమంధ్ర గొంతులు ఉన్నాయి.సమైక్యత రాగం అందుకున్న సీమంద్రుల ఉద్దేశాలేంతో తెలంగాణా ప్రజలకు బాగా తెలుసు .తెలంగాణా అభివృద్ధి చెందినదా ,హైదరాబాద్ అభివృద్ధి చెందినదా?ఎవరి అభివృద్ధి దేనికి కారణమైంది ?హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణా ప్రజల పొట్ట కొట్టి ,నోట్లో మట్టి కొట్టి చేసిందే ఈ అభివృద్ధి అంత.కొన్ని పార్టీలు సామాజిక తెలంగాణా కావలి అని ,సీమంధ్రులు చేపట్టిన ఉద్యమాన్ని చూసి ప్రజల్లో ఇంత బలమైనా కోరిక ఉండనుకోలేదు అంటున్నారు.మరి తెలంగాణా వాళ్ళు ప్రజలు కాదా?

సీమంధ్రలో ,వారసత్వంగా ఆస్తులు ఇష్టరేమో కాని ,తెలంగాణా లో పోరాటాలను వారసత్వంగా ఇస్తారు .తెలంగాణా అంత ఉద్యమ చరిత్రే.షరతుల ప్రకారం తెలంగాణా లో కలిసిన సీమంధ్రులు పదే పదే షరతులను ఉల్లంఘిస్తారు .విడి పోవడానికి మాత్రం ఒప్పుకోరు . సీమంధ్ర పాలకుల స్వీయ అభివృద్ధి ని హైదరాబాద్ అభివృద్దిగా చూపుతూ సమైఖ్య"ఆంధ్ర" కావాలని మూర్ఖంగా మాట్లాడుతున్నారు.తెలంగాణా ఉద్యమం తెలంగాణా రాష్ట్రం వచ్చాకే ఆగి పోతుంది .ఇప్పటి పరిస్థితులు తెలంగాణా రావడానికి దారి తీయకున్న ఈ ఉద్యమం మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటుంది .సీమంధ్రులు ఏదైనా మాట్లాడేది ఉంటె మా పొట్ట కొట్టి వారు అభివృద్ధి చేసామని చెప్పుకుంటున్న హైదరాబాద్ గురించి మాట్లాడాలి కాని, సమైఖ్యాంధ్ర గురించి కాదు.