23, డిసెంబర్ 2009, బుధవారం

మళ్లీ మోసం

మళ్లీ మోసం

ఆంధ్ర వాళ్ళు అనుకున్నది సాధించారు. సీమాంధ్ర మంత్రుల భేటిలో మరి మాటలే జరిగాయో కేంద్ర ప్రభుత్వానికి మూట లే అందాయో. లంగడ పాటి లంగా దీక్ష చేస్తున్నప్పుడు,మిగితా నాయకులు దొంగ దీక్షలు ఒక్కొక్కరు గ విరమిస్తుంటే మనం అర్థం చేసుకోలేక పోయాం .వారంతా కోట్ల కి పడగలేతినా ఇంకా దీక్ష చేసి విరమించింది ఈ ప్రకటన వస్తుందన్న ధీమాతోనే కావచ్చు. మరి ఆ మూటలు తెలంగాణా పాలకులకు అందాయో ,లేదో అందితే రాజీనామా చేయరు .అందకుంటే, అందేలా రాజీనామా చేస్తామని బెదిరిస్తారు కాని చేయరు .అది మన తెలంగాణా పాలకుల నోరు ఇలా డబ్బు తో నొక్కేస్తున్నారు కాబట్టే ఇక్కడ ఇన్నాళ్ళు మోసం జరిగింది .ఇక కూడా జరగ బోతుంది.

మన ప్రజల కష్టాలు వీరికేం పట్టింది? డబ్బుకి ఎవరైనా దాసోహం కదా .తెలంగాణా పాలకులు రాజీనామా చేయక పోతే మనం ఎంత చేసినా వృధా .వారు రాజీనామా చేయక పోతే తెలంగాణా లో తిరగనీయ వద్దు. సమైఖ్య "ఆంధ్ర" ఉద్యమం ప్రజల నుండి వచ్చిందట మనం కామ ప్రజలం .మనం చేసేవి ఉద్యమాలు కావ? ౬౦ 60 ఏళ్ల పోరాటాన్ని నీరు కార్చి ,నీరు ,నీడ దోచేస్తుంటే కేంద్రానికేం పట్టింది .మన ఖర్మ కాలి ఆ నాడు ఆంధ్ర తో కలిపేసారు .డబ్బు మదం తో పీల్చి పిప్పి చేసారు .పిప్పిని కూడా వదలకుడదని ప్రతిన బునారు .
ఉన్నవి ,లేనివి అని కాకుండా ప్రతిదాని మీద ఆంధ్ర అని ముద్ర వేస్తుంటే ఇన్నాళ్ళు ఊరికే ఉన్నామని మనకీ శిక్ష విధిస్తున్నారు .చందా,ప్రచండ శాసనుడి గా ,ఐరన్ లెగ్ శాస్త్రి గా రోశయ్య కి బిరుదు ఇస్తే సరిపోతుందేమో. ఆంధ్ర వాళ్ళ నమ్మకం ఎంత గా ఉందంటే మన(తెలంగాణా) డబ్బు తో ఏదైనా చేయగలుగుతాం అని .ఎప్పుడైనా ముఖ్య మంత్రులు సీమాంధ్ర నుండి కదా ఉంటారు మాకేంటి వచ్చే నష్టం అని అంటున్నారు.మన పోరాటం మన తాతల నుండి మన ముని మనుమల దాక సాగినా తెలంగాణా రానివారు ఈ ఆంధ్ర పాలకులు .కోట్లకు పడగలెత్తిన లంగడ పాటి ,జ చ ,జగన్ లాంటి వాళ్ళు ఉన్నన్ని రోజులు సీమాంధ్ర పాలకుల కింద మనం బానిసలమే.బ్రిటిష్ వాళ్ళ కింద బానిసలుగా లేని మనం వీరి వద్ద బానిసలుగా ఉండాల్సి రావడం మన దురదృష్టం.

నిజాం చేసింది మన మీద దాష్టీకమే కావచ్చు .అది మనం చూడలేదు కాని ఈ ఆంధ్రుల దాష్టీకం నిజాం ని మించి పోయింది కావచ్చు.ఒక విధంగా మనకు నిజాం మేలు చేసాదేమో లేకుంటే నిజాం ని కూడా ఆంధ్ర తెలివి చూపించి ఈమి మాయం చేసేవారో ?ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆసుపత్రులు ,ప్రభుత్వ భవనాలు ,చారిత్రక కట్టడాలు కూడా ఉండేవి కావేమో.ఉదయం మన జన్మ హక్కు లా మారి పోయింది .ఒక ప్పుడు నిజాం దాష్టీకానికి తట్టుకోలేక (బండెనక బండి గట్టి ,పదహారు బండ్లు గట్టి ఎ బండ్ల పోతావ్ కొడుకో నిజాం సర్కరోడా అని పాడుకున్నాం) చేసాం ఇప్పుడు ఆంధ్ర పాలకుల దాష్టీకం తట్టు కోలేక చేస్తున్నాం.వీరి నుండి ఎప్పుడు మనకు విముక్తి ?అప్పుడు మళ్లీ పాడాలి బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఎ బండ్ల బోతావ్ కొడుకో సీమాంధ్ర సర్కరోడా అని.

మనం చేసే పనులకు ఎం ఎం సి కంపెనీలు రావట్లేవత ఎందుకు వస్తాయి అక్కడ కూడా ఉంది వారే కదా ఎందుకు వస్తారు. హైదరాబాద్ పేరు చెప్పి స్వీపెర్ పదవి కూడా తెలంగాణా కి ఇవ్వరు. ఇంటర్వ్యూ కి పిలుస్తారు తర్వాత పిలుస్త మంటారు పిలవరు.ఎన్ని చూడలేదు ఇలాంటివి? నాలుగు రోజుల క్రితం హి చ ఎం టి వి వారు చేసిన ప్రయత్నం ప్రభుత్వం ఎందుకు చేయదు?
కొంత మంది అంటారు తెలంగాణా వస్తే అభివృద్ధి జరగదని ఇపుడు మాత్రం ఏమి అభివృద్ధిజరిగింది? స్వాతంత్ర్యం ఇస్తే భారత దేశం అభివృద్ధి జరగదు అని ఆంగ్లేయులు అనుకుంటే మనకు స్వాతంత్ర్యం రాక పోయేదేమో ?మన అభివుద్ది గురించి ఆంధ్రులు మనకు చెప్పాలా ఇకాడ అభివృద్ధి ఆగి పోయేది రాష్ట్రానిది కాదు వారి అభివృద్ధి ఆగి పోద్ది అందుకే అంటున్నారు వద్దని.
తెలంగాణా వస్తే కొంచెం అయినా మన భాధలు తీరతాయనుకుంటే సీమాంధ్ర పాలకుల భాధ మరోలా ఉంది .తెలంగాణా విడి పోతే రాష్ట్ర రూపు rekha అందంగా ఉండవని, ఇప్పుడున్న పేరు మార్చి "తెలంగాణా" గ మార్చు కోమని అంటున్నారు.మంకు కావాల్సింది అది కాకున్నా ఒక వేల అదే అనుకుంటే ఈ మాటకు ఎంత మంది సీమాంధ్ర పాలకులు ,ప్రజలు సరే అంటారు ? మన భాష వారి మనసులని గాయ పరుస్తుందంటే మన మాట వారి గుండెల్ని చేరుతుందనే కదా. మరి వారి మాట మనుసుని కాదు కదా చెవిని చేరినా సీసం పోసినట్టు ఉంటుంది .

అందరు తెలుగు వారు కలిసి ఉండాలని ఉంటె మరి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎందుకు తెలుగు వారు మనతో కలవకుండా ఉన్నారు?తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రం లో ఉండాలని ఏదైనా నియమం ,నిభందన ఉందా? రాజ్యాంగం లో రాసి ఉందా ? అల తెలుగు మాట్లాడే వారంతా ఒక రాష్ట్రంగా ఉండేది నియమైతే హిందీ మాట్లాడే వారు ఎందుకు వేరు వేరే రాష్ట్రాల్లో ఉంటున్నారు?

ఉద్యమం ఎలా ఉంటుందో మనం ఎన్నో సార్లు చూపించాం.ఇప్పుడు అదే ఉద్యమం ఉప్పెన అయితే ఎలా ఉంటుందో చూపిద్దాం.ఉసర వెళ్లి లా రంగులు మార్చే రాజకీయ నాయకులూ మన జీవితాలను లిఖించే ఖర్మ మన ప్రజస్వమ్యన ఉంది .తెలంగాణా అంటేనే తెలుగు మాట్లాడేవారు అని అర్థం .అల్లాంటిది మన భాష దగ్గరి నుండి భావాల వరకు మనల్ని ప్రతిఘతిస్తుంటే ఉరికే ఉండాలా? నీరు నుండి నిలువ నీడ చూపే భూమి వరకు కొల్లగోడుతుంటే మిన్నకున్దాల? మనకు తెలిసి సీమంధ్ర పాలకులు కోట్లు గడిస్తే ,మనకు తెలియని స్విస్ బ్యాంకు ఎకౌంటు లో ఎన్ని ఉన్నాయో?
ప్రభుత్వాలు,పాలకులు ఇలా ఉంటె నక్షలిస్మ ,ఉగ్ర వాదం పెరగటం లో తప్పు లేదు.తెలంగాణా కోసం మనం కూడా ఉగ్ర వాదుల్ల ఉద్యమం చేయాలి.మనం చిందించే ఒక్కో రక్తపు బిందువు నుండి తెలంగాణా ఉగ్రవాదిని తాయారు చేయాలి .రక్తం మాసాలు తుంటే తెలంగాణా వాళ్ళది,తేనే పలుకు లు పలుకుతున్న కేంద్రం,సీమధ్ర నేతలకు మనసంటూ ఉందా ?మనుషులేనా వారసాలు?మన ఆవేదన అర్థమయ్యేనా?నడిచేది,నడిపించేది సీమాంధ్ర నేతల్యి నప్పుడు ఇలాంటి ప్రకటనలో ఆశ్చర్యం ఏముంది?

21, డిసెంబర్ 2009, సోమవారం

తెలంగాణా కావాలా?it's the time for decision

తెలంగాణా కావాలా?
---it's the time for decision


ప్రజలారా మీ కు కావాలా సమైఖ్యాంద్ర ? కావాలను కునే వారు చేతులెత్తండి .చేతులేత్తించే వారు ఉన్నంత వరకు చేతులేత్తు తుంటారు గొర్రె జనాలు. ఎవరి ఉద్యమం వారిది ఇష్టం వచ్చినట్లు తిండి అరగక దీక్షలు. ఎవరిదీ న్యాయ పోరాటం అని అర్థం చేసుకునే తెలివి లేదా? తెలుగు మాట్లాడితే తెలుగు వారు అంత ఒకటేనా? మరి తెలంగాణా వారు మాట్లాడేది తెలుగు కాదని మీరే అంటారు కదా మరి ఎందుకీ రభస? కోట్లు కాపాడు కోవడానికి దీక్షలు అవసరమా? కోటీశ్వరులు చేసే ఈ దీక్ష నిజమైనా దేనా? దొంగ లా దొంగ బుద్ది చూపించి పారిపోయే వారు చేసేది నిజమైనా ఉద్యమమా?
సమైఖ్య "ఆంధ్ర" ఉద్యమం చేసేది వివక్షతోనే చేస్తున్నారు .అదేదో తెలుగు వాళ్ళ సమైఖ్యత ఉద్యమ అని పెట్టుకోవాచు కదా.ఇక్కడ కూడా ఆంధ్ర తెలివి తేటలు చూపించారు. అయినా మీ అందురులు ఇంకా సమైఖ్యంగానే ఉన్నారు కదా ? సీమంధ్ర కావాలని చేయండి పోరాటం. తెలంగానని వదిలేయండి. మొదలు పెట్టిన ఉద్యమాలు "జై ఆంధ్ర ", గ్రేటర్ రాయల సీమ అని .కాని ఇప్పుడు జరుగుతుంది సమైఖ్య "ఆంధ్ర" అని అంటున్నారు ఆంధ్రులు దీనికి తెలివి తక్కువ గ సీమ వాళ్ళు వంత పాడుతున్నారు .తెలంగాణా ఏర్పడితే ఆంధ్రులతో కలిసి ఉండమన్న సీమ వారు ఇప్పుడు ఆంధ్ర పాలకులు చేసే కుటిల రాజనీతికి దాసోహం అయ్యారు . ఒక్క సారి ఆంధ్ర వాళ్ళని అడిగి చుడండి ,తెలంగాణా ఏర్పడితే మీ తో కలిసి ఉంటామంటే ఆంధ్రులు ఏమంటారో చూడండి.ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉండదు .

ఇంకెన్నాళ్ళు అమాయకుల చేసి బొజ్జ నిమ్పుకుంటారో మరి ఈ ఆంధ్రా పాలకులు.సంపాదించి బొంద మీద వేసుకొని పోతారేమో ? ఈ ఆంధ్ర పాలకులు . మాట మార్చే ఉసర వెళ్లి రాజ కీయ కుతంత్రాలకు గొర్రెల్లా మారిన ప్రజలను చూస్తే జాలి వేస్తుంది.తెలంగాణా ఉద్యమం ఈ నాటిది కాదని తెలిసి , చిన్న పిల్లాడి మనస్తత్వం లా నాకు చందమామ కావాలని అన్నట్టు .మేము ఇంకా తెలంగాణా వారితో కలిసే ఉంటామని, వారినుండి దోచుకుంది ఇంకా చాల లేదని సమైఖ్య "ఆంధ్ర" ఉద్యమం తేరా పైకి తెచ్చారు .ఇంకెన్నాళ్ళు తయారు గ ఉన్న సంపదని కొల్ల గొడతారు? మీకంటూ సదుపాయాలూ వద్ద? ఈ రోజు సద్దు మనిగినట్లనిపించినా మల్లి ఎప్పటికైనా ఈ ఉద్యమం ఆ గడు. మీ వైద్యం కోసం ఇంకా తెలంగాణా ఆసుపత్రుల మీద ఆధార పడుతున్నారంటే మీకే సిగ్గు చేటు.
ఈ ఉద్యమం లోను సీమ వారు అనే మాట ఇంతకు ముందు అన్నదే .తెలంగాణా కంటే సీమ వారు వెనుక పది ఉన్నారని .అయినా సమైఖ్య"ఆంధ్ర" కావాలని .వారు ఒక విషయం ఎందుకు అర్థం చేసుకోరు ? ఇన్నాళ్ళు ఉన్నది సమైఖ్యంగానే కదా అయినా వెనకపడే ఉంది కదా?ఇంకా సమైఖ్య వాదమే కావాలని కోరు కుంటు న్నారంటే వారికి అభివృద్ధి అవసరం లేదా?
తెలంగాణా ఇప్పుడు రాష్ట్రంగా మారితే వచ్చే నష్టం ఏమిటి ? ఆంధ్ర ,సీమ వారు ఎందుకు అంత దిగిలు చెందుతున్నారు? ఒక వేల కష్ట ,నష్టాలు వచ్చినా ఇన్నాళ్ళు పడిన కష్టం కంటే అది ఎక్కువేమి కాదు.ఇప్పుడు పడే కష్టమేదో అప్పుడు పడతం .తెలంగాణా ని ప్రపంచం చెప్పుకో స్థాయిలో అభివృద్ధి చేస్తాం .సామాజిక తెలంగాణా కావాలి, బంగారు తెలంగాణా కావాలి అని చిలుక పలుకులు పలికే నాయకులు అది వచ్చే సమయానికి ఎందుకు అడ్డు తగులుతున్నారో?
జగ మెరిగిన సత్య మేమంటే ఆంధ్ర పాలకులు బాగా గడించారనేది .అది ఎలా సంపాదించారో కూడా అందరికి తెలుసు .ఇప్పుడు ఆంధ్ర పాలకుల వదనాళ్ళ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాద్ ని అభివృద్ధి మేమే చేసాం అని. ఆ అభివృద్ధి హైదరాబాద్ ని కాదు వాళ్ళని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి అని తెలుసుకోలేమా? ఒక వేల హైదరాబాద్ ని అభివృద్ధి చేసుంటే కోటీశ్వరులు అయింది ఎవరు? ఒక వేల అభివృద్ధి చేస్తే ,అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ ఒక్కటే ఉందా? ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకా ప్రదేశాలు లేవా? విషపు నీళ్ళు తాగుతూ, హైదరాబాద్ కి మంచినీరి,గుంటూరు కి సేద్యపు నీరు అందిస్తేనే కదా అభివృద్ధి చెందింది? ఒకరి కి ఘోరి కడుతూ ఇంకొకరు డబ్బు సంపాదిస్తే అది అభివ్రుద్దియ?
సంవత్సరానికి మూడు పంటలు మా నీటి తో పండించి మాకే ఎగ నామమ? కరెంటు కష్టాలు,కన్నీటి వ్యధలు ఇక్కడ ,చేపల పులుసులు ,పూత రేకులు అక్కడ .రాజధాని కాబట్టి హైదరాబాద్ ని అభివృద్ధి చేశామంటే పది జిల్లాల తెలంగాణా రాబడి ఎక్కడికి వెళ్తుంది? ఎవరు దోచేస్తున్నారు? హైదరాబాద్ ని అభివృద్ధి చేసామని మీరు భావిస్తే ఇంకా ఇక్కడ మురికి వాదాలు ఎందుకు మిగిలి ఉన్నాయి? దుర్గందపు ముసి నది ఎందుకు ప్రవహిస్తుంది ?

ఆంధ్ర,సీమ ప్రజలకు విన్నవించేది ఒక్కటే ,తెలంగాణా వస్తే మీకు వచ్చే నష్టమేమి లేదు .మిమ్మల్ని ఎవరు ఏమి అనరు .ఆదరణలో అమ్మ ప్రేమ కన్నా గొప్పది తెలంగాణా అది మీకు తెలుసు.అక్కున చేర్చుకుని అన్నం పెడితే ,మా నోట్లో దుమ్ము పోసే ప్రయతనం మానుకోండి.