20, మార్చి 2010, శనివారం

ప్రేమ పెళ్లి -పెద్దల పెళ్లి

           ప్రేమను పంచి ,ప్రేమగా చూసుకునే తోడు లభించిన నాడు ఎంతో అదృష్టం .ఎవరు ఎన్ని చెప్పిన వినిపించని మనిషికి తోడు మనసు .ప్రేమలో పడితే సర్వస్వం ప్రేమించిన మనిషే .తీసుకున్న నిర్ణయం ఆలోచన ఉంది తీసుకున్నప్పుడు ఉన్న ధైర్యం  ఎంతకైనా తెగించేలా చేస్తుంది.ఎవరిఅనైనా ఎదిరించేలా చేస్తుంది .ప్రేమ పెళ్లి కి ,ప్రేమికులకు సమాజం లో ఎప్పుడు చిన్న చూపే .పంచె ప్రేమ నిస్వార్థం గా ఉన్నన్ని రోజులు ఎవరు ఎన్ని చెప్పినా ,ఎవ్వరు విడదీయ లేరు. మరి ఈ పిల్లల ప్రేమకి  ఎన్నో అడ్డంకులు ఏదో ఒక రూపం లో ఉండనే ఉన్నాయి. తల్లిదండ్రులు పంచె ప్రేమను మరచి ప్రేమికులు తమకు తాము ఎన్నో ఊహించుకుంటారు .ప్రేమికుల దృష్టిలో ఒకరంటే ఒకరికి ఎంతో నమ్మకం మున్ముందు జీవితం లో ఎలా ఉంటారో అనే ఒక మానసిక సంఘర్షణ పెద్దలను ఎప్పటికి వేధిస్తుంది .ఆ ఆవేదనే ప్రేమికుల ప్రేమకు అడ్డుగా నిలుస్తుంది .తల్లి దండ్రుల అనుభవం ,ప్రేమికుల అనురాగం ఈ రెంటి మధ్య మొదలయ్యే యుద్ధం ఎవరికీ వారు తమ తమ నిర్నయాలనుంది సడలరు. ప్రతిఫలంగా ప్రేమికులైతే ఒకటవు తారు కాని ,పెద్దల దృష్టిలో దోషులవుతారు .ప్రేమ పెళ్లి పెద్దల పెళ్ళిగా మారితే ఆ ఆనందం అందరిది .

    ప్రేమించిన వారిని ఎందుకు,ఎప్పుడు ప్రేమించామో తెలియదు .ఈ నిమిషంలో మనసులో ఆ అనుభూతి కలుగుతుందో,ఆ నాటి నుండి పెద్దల దృష్టిలో వాళ్ళు దొంగలు.ప్రేమికుల దృష్టిలో వాళ్ళు భావిష్య్యతు  గురించి బేరీజు వేసుకునే అంశాలు చాల తక్కువ .కాని ఇక్కడ ఉన్న ఒక సదుపాయం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ,ఏ నాడు అయితే ఆ అర్థం ,అపార్థం అవుద్దో ఆ నాడు ప్రేమికులు విడి పోతారు.ఈ విషయం లో నే పెద్దలు ఆందోళన చెందేది .పెద్దలు నిర్ణయించే పెళ్లి లో వారి అనుభవాన్ని జోడించి జీవిత భాగస్వామిని నిర్ణయిస్తారు .పెద్దల పెళ్ళిలో నిర్ణయాలు తీసుకునే సర్వాదికారం పెద్దలవే. ఎన్ని సంభందాలు చూసినా ,అమ్మాయి అబ్బాయిలు తీసుకోవాల్సిన నిర్ణయం ఒక్కటే అది ఒకరికి ఒకరికి నచ్చటం ఇక్కడ అమ్మాయి ,అబ్బాయి అందానికి ఒక ప్రాధాన్యత అయితే (ఈ ఒక్కటి మాత్రమె పిల్లల నిర్ణయం )ఆస్తి ,అంతస్తులు ,కట్నం మరో అంశం .ఒకరికి ఒకరు నచ్చినా పెద్దలు తీసుకునే నిర్ణయమే ముఖ్యం .ఇక్కడ పెద్దలు ,పిల్లల దృష్టిలో దోషులవుతారు అలాగని పెద్దలని తప్పు పట్టాల్సిన పని లేదు .ఎందుకంటే పెద్దలు ఆలోచించేది పిల్లల భవిష్యత్తు గురించే .ప్రేమ పెళ్లి లో ప్రేమికులు అసలెందుకు ఇలా చేస్తున్నారో అని పెద్దలకు అర్థం కాదు. పెద్దల పెళ్ళిలో పిల్లలకు పెద్దలు ఇలా ఎందుకు చేస్తున్నారు అర్థం కాదు .ప్రేమ పెళ్లి లో ప్రేమికులు ఒకరికి ఒకరు నచ్చి ,అర్థం చేసుకుని పెద్దలకు నచ్చ జెప్పినా పెద్దలకు ఆ ప్రేమ అర్థం కాకున్నా పెళ్లి జరుగుతుంది కాని పెద్దల పెళ్ళిలో ఒకరికి ఒకరు నచ్చినా పెద్దలకు అర్థం(కట్నం ) అయితేనే పెళ్లి జరుగుతుంది.