15, అక్టోబర్ 2009, గురువారం

ఆవేదన

పగిలిపోయిన హృదయానికి ఔషధం ఉందా?
పగల గొట్టిన దేవునికి హృదయం అంటు ఉందా?
జీవితానికి ఆశ అని నిను చూపి
జీవితానికి అడియాషగా నిన్ను దూరం చేశాడు
గోపాల బాలునిగా గోపికలకే కృష్ణుడు
ఏక పత్ని వ్రతుడిగా సీతకే రాముడు
ప్రేమను పంచడానికే రూపాలు మార్చిన గోవిందుడు
నా ప్రేమ గెలవకుండా, మరొకరి ప్రేమను పొందకుండా ఒంటరిని చేశాడు
ఆవేదన అర్థమైతే ఆలోచించక వరమివ్వు
ఆనందం నాకు సొంతం చేసే నా ప్రేమను నాకు దక్కనివ్వు.

కదలదే కాలం

అవును అనడానికి ఆనందం ఎక్కడుంది
కాదు అనడానికి కారణాలేమి ఉన్నాయి
కలిసి ఉందామనుకున్నది ఒక కల
విడి పోయామన్నది కల కాకుడని ఒక నిజం
దేవుడు నా దేవతను దూరం చేసాడని నిందించనా
దేవుని రూపం లో ఇదంతా చేసిన మనిషిని దూశించనా
మంచి చేసింది మనిషికా ,మనసుకా ఈ కాలం
కాకా వికలం చేసి కదలదే మంచి కోసం ఈ కాలం