13, మార్చి 2010, శనివారం

అభిమానాన్ని పంచేది

అభిమానాన్ని పంచేది
ఆనందాన్ని ఇచ్చేది నీనైతే
అలుసుగా చూసేది
ఆత్మీయతను చంపేది నీవు
చూపించిన ప్రేమనంతా
ఛీ కొట్టి పోయావు
మురిసిన మనసులో అంత
అలజడే సృష్టించావు
చచ్చిన పామునే చావా బాదే
ఖతినాత్మురాలిగా మారావు.

పలికించు నీ నాదం

పలికించు నీ నాదం
పది మందికి వినిపించేలా
మానస సరోవరం
మరోమారు ఉప్పొంగేలా
కోయిలమ్మ గానం లా
మైమరపించే నీ సరాగం
గొంతెత్తి పాడే సమయం
గోకులమంత పరవశం
నలు దిక్కులా నీ నామం
మారు మ్రోగాలి ఈ యుగాంతం

అమ్మ నా ఆనందాన్ని

అమ్మా నా ఆనందాన్ని ఆపింది ఎవరు ?
ఆటలాడే చిన్ని తనాన్ని చిదిమింది ఎవరు ?
ఇల్లు నే ఒక భందిఖానగా మార్చింది ఎవరు ?
ఈ రోజు ఆడుకో అని చెప్పేది ఎవరు ?
ఉడుతలా గెంతకుండా చేసింది ఎవరు ?
ఊయలూగుటకు స్థలం లేకుండా చేసింది ఎవరు?
ఎన్నాళ్ళు ఉండేది ఈ బాల్యం ?
ఎం కావాలి నా భవితవ్యం ?
ఒళ్ళు అలవకుండా
ఓనమాలు ఎలా దిద్దటం
ఔదార్యం లేని చదువెందుకు చదవటం ?
అందరు ఆలోచించండి
ఆః అనేలా మము తీర్చిదిద్దండి .