11, ఫిబ్రవరి 2009, బుధవారం

వరం నాకు ప్రసాదించలేదు

చెలిమి అందించిన దేవుడు చెలిని అందించటం లేదు.
చేతిలో చేయివేసి నడిపించి చెయ్యి అందించటం లేదు.
చెప్పగలిగిన మాటలు చేతల్లో చేయ్యనీవటం లేదు.
చెదిరిపోని జ్ఞాపకాలు ఎన్ని ఉన్న చెంత ఉండే తోడు ఇవ్వటం లేదు.
చేయగలిగేది నేనైనా చేయించే నీ వరం నాకు ప్రసాదించలేదు

నీర జాక్షి నీవు నా దానివేనా

నీర జాక్షి నీవు నా దానివేనా ?
నీలో ఉన్నది నీనేనా?
నీకు జీవితం పంచగాలిగేనా?
నిన్ను నా దాన్ని చేసుకో గలనా?
నిన్ను వరియించి నీతో సహజీవనం చేయగలిగేనా?
నాలో ఈఊహలకు అంత మెప్పుడు?
నా ఈ ఆనందాన్ని సొంతం చేసేదెప్పుడు ?

ఎవరు నాకోసం

ఎదలో ఎవ్వరు లేరు నా కోసం
ఎప్పటికి రారు నాకోసం
ఈ పూట ఇరువురం
రేపటికి కావచ్చుఒక్కరం
నమ్మకమే లేదు నా ఆనందం లో
సగ భాగమెవ్వరికో
నాకు ఆశే లేదు నా జీవితం లో
తోడు ఎవ్వరికో
ఎవరు నా కోసం
నాకు నీనేనా నాకంటూ ఒకరున్నారా?

10, ఫిబ్రవరి 2009, మంగళవారం

గాయాన్ని మాన్పే శక్తి ఏది?

గాలి వానకు గాయ పడ్డ చిలుకమ్మ
గాయం తగిలింది మనసుకా, మనిషికా ?
గాయంలోతు ఎంతైనా మాన్పే హృదయం నీ దగ్గర లేదు
గాడి తప్పిన హృదయం గాలిలో కాగితమే
గోతిలోన పడునో, జ్ఞానాన్నే పంచునో
గాయం మానదు మాన్పే శక్తి నాకు లేదు

నిన్ను నీవు కష్ట పెట్టుకోకు

నిన్ను కూల్చే శక్తులు నీ పక్కనే ఉంటాయి
నిన్ను ముంచే దాక నిదరోకుంటాయి
నిన్ను జాగ్రత్త పరచే మీ మనసును చంపేస్తాయి
నిన్ను నడి సంద్రాన వదిలి నవ్వుకుంటాయి
నిన్ను నీవు కష్ట పెట్టు కోకు
నీ అదృష్టాన్ని వదులుకోకు.