11, డిసెంబర్ 2009, శుక్రవారం

ఇక చాలు మీ ప్రేమ

ఇక చాలు మీ ప్రేమ
-'ఆంధ్ర' Resigned it's a new game again

తెలంగాణా తీర్మాన్నాని అసెంబ్లీ లో ప్రవేశ పెట్టాలని ప్రకటించక జరిగిన పరిణామాలు చాల నాటకీయంగా ఉన్నాయి. కొంచెం ప్రేరణగా ఉన్నాయి . తెలంగాణా కోసం అమర వీరులైన విద్యార్థులు ,ప్రజలు చేసిన త్యాగాలు వృథా అవుతాయేమో నని భయంగా ఉంది .అర్థం కాని విషయం ఏమి టంటే వీళ్ళు రాజీనామాలు ఎందుకు చేసారని ? ఇక్కడ ఉద్యమం 50 ఏళ్ల నుండి కొనసాగుతుంది .ఎంతో మంది తెలంగాణ కోసం బలి అయినారు .కాని క్రొత్తగా మాకు ప్రత్యేక ప్రత్యేక ఆంధ్ర ,గ్రేటర్ రాయల సీమ కావలంతం హాస్యాస్పదం.

రాజీనామాల విషయం లో ఆంధ్ర ,సీమ నాయకులను మెచ్చు కోవచ్చు .ఎందుకంటే మన రాజకీయ నాయకులూ చేయని పని చేసారు .కాని ఇది వారు మన ఉద్యమాన్ని నీరు కార్చడానికే అని అందరికి తెలుసు .మేము ఆంధ్ర వాళ్ల మోచేతి నీళ్లు తాగాలా? అని సీమ వారు అంటారు. తెలంగాణా వారేమో ఆంధ్ర వాళ్లు మాకు అన్యాయం చేస్తూ న్నారు అంటారు . మొత్తానికి ఆంధ్ర వారే బాగు పడ్డారని కదా దీని అర్థం. లేక ఆంధ్ర వాళ్ళకి మందిని ముంచే తెలివి బాగా ఉందనా అర్థం ?

మేము వెనుక పడ్డం అని సీమ వారు అంటారు ,మేము వెనుక పడ్డం అని తెలంగాణా వారు అంటారు మొత్తానికి ఆంధ్ర నే అభి వృద్ది అయిందని కదా దీని అర్థం. మరి ఇంకెందుకు వారి నాటకాల రాజీనామాలు ? హైదరా బాద్ ని అభివృద్ధి చేసాం అని అంటున్నారు ఆంధ్ర వాళ్లు . హైదరాబాద్ ని ఎంత అభివృద్ధి చేసారో ఇక్కడి సంస్కృతి అంతకన్నా ఎక్కువగా దిగ జార్చారు చెత్త సినిమాలు తీసి. హైదరాబాద్ అభివృద్ధి ఎవరి పొట్ట కొట్టి చేసారు? ఎవరి రక్తాన్ని స్వేదంగా మార్చి చేసారు ? 400 ఏళ్ల నుండి హైదరాబాద్ తెలంగాణా లో అంతర్భాగం. హైదరాబాద్ పై పూర్తి హక్కులు తెలంగాణా వారివే .తెలంగాణా ప్రజలు ఎవరిని ,ఎక్కడికి వెళ్ళమని అనలేదు కదా ఉంటే ఉండండి. కాని మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు న్యాయం కోసం 50 ఏళ్ల నుండి పోరాడుతుంటే ఇప్పుడు మీరు చేసే కుట్రలను సహించేది లేదు ఇప్పటికే చాల కుట్రలు చేసారు . మా ఉద్యమం కడుపు మాడి చేస్తుంటే మీరు తిన్నది చాలక ఇంకా తినాలని చేస్తున్నారు

2004 లో పోతు ఏమని పెట్టుకున్నారు ?ఎందుకు పెట్టుకున్నారు? ప్రత్యేక రాష్ట్రం ఇస్త మనే కదా ? UPA common minimum programme లో ఎందుకు తెలంగాణా చేర్చారు? అప్పుడు చేయని రాజీనామాలు ఇప్పుడెందుకు చేస్తున్నారు ? అప్పుడు ఎక్కడైనా పడుకున్నారా ? ఆంధ్రులకు ,సీమ వాసులకు ముందు ఒక నిర్ణీత అభిప్రాయం లేదు .కొంత మంది సమైఖ్యాంధ్ర అంటారు కొంత మంది జై ఆంధ్ర అంటారు ఇంకొందరు గ్రేటర్ రాయలసీమ అంటారు నిర్ణీత అభిప్రాయం లేని మీరా మా ఉద్యమాన్ని తప్పు పట్టేది ? లగడ పాటి ,J.C. ,జగన్ వీరికి M.P. ఉండాల్సిన అవసరం ఏముంది? కోట్లకు పడగలేత్తినారు .పొత్తు పెట్టుకున్నప్పుడు లేని ఆందోళనలు ,ఆత్మ హత్యలు ఇప్పుడు ఎందుకు ? ఆంధ్ర ,సీమ ప్రజలు TRS తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎందుకు MLA,MP లను నిల దీయ లేదు ?

kcr నిరాహార దీక్ష చేయ బయలు దేరినపుడు పోలీస్ అరెస్టు చేసి నానా రగడ చేసారు కాని ఇప్పుడు ఎందుకు చేయరు? ఇక్కడ రాళ్ళు రువ్వితేనే ఉద్యమం లోకి సంఘ విద్రోహ శక్తులు వచాయి అన్నారు .మరి ఇప్పుడు వారు ప్రొక్లెఇనర్ తో బస్ స్టాప్ పద గొట్టి ,బాంబ్ వేష్టం అంటున్నారు ఎవరిదీ విద్రోహ చర్య? ఇక్కడ విద్యార్హ్తులు మౌన ప్రదర్శన చేసినా కుక్కలా కొట్టి నారు మరి అక్కడ అన్ని బస్ తగల బెట్టినా మిన్న కున్నారు (అలా కొట్టాలని కోరిక కాదు)ఇదంత తెలంగాణా ఉద్యమానికి జరుగుతున్న కుట్ర అని తెలిసి పోతుంది
తెలంగాణాని వదిలి ఆంధ్ర ,సీమ వారు ఉండ లేక పోతున్నారు ఎందుకో కపట ప్రేమ. తెలంగాణా వస్తే ఎవరిని వదిలి వెల్లమన్నాము ? ఎవరిని చంపుతా మన్నాము ? వారి భయమల్లా ఇప్పుడున్న స్వేచ్చ హరి యిస్తుందని .తెలంగాణా వారిని ఇంతకు ముందు లా వారిని దోచుకోలేమని బెంగ .తెలంగాణా ప్రజలకు ఆంధ్ర ,సీమ వారిలాగా రెండో ఆలోచనే లేదు మాకు కావాల్సింది తెలంగాణా స్వతంత్రం అది ఒక్కటే అజెండా .నక్సల్స్ ఉద్యమం మొదలైనదే ఆంధ్ర పాలకుల దురాగతాలను ఎదిరించడానికి .వారి అన్యాయ పాలన నుండి విముక్తి ప్రసాదించాలని .
తెలంగాణా ఏర్పాటు ప్రక్రియలో తొలి అడుగు సరిగా పడనే లేదు ముళ్ళ కంపాలా కాలికి అడ్డం వస్తున్నారు ఆంధ్ర ,సీమ పాలకులు నయవంచకులు స్పూర్తిని చంపు కోకుండా తెలంగాణలో కొత్త సూర్యుని ఉదయింప చేయాలి .

జై తెలంగాణా

10, డిసెంబర్ 2009, గురువారం

తొలగింది అర్ధరాత్రి

బ్రిటిష్ దొరల పాలన
ఆంధ్రుల దొరల పాలన
తొలగింది అర్ధరాత్రి
ఆ నాటి భారత దేశ పరిస్థితి
నేటి తెలంగాణా పరిస్థితి
ఆంధ్రులు చేసింది అభివృ ద్దియో
దోపిదియో తెలంగాణా అంటే వారికెందుకు భయం
నేటి భారత దేశం
రేపటి తెలంగాణా
కలిసి సాగి కస్తలను కదా తెర్చుదాం
అభివృద్ధి సుస్థిరం చేస్తాం
ఆనందాలను నింపేస్తం

తెప్పించరా తెలంగాణా

తెప్పించరా తెలంగాణా
తెలివిగా జీవించేందుకు
తెల్లవారే రేపటి ఉషోదయం
నీ పిల్లలకు న్యాయం చేయాలి
దోచుకు పోతున్న నీటిని
దోసిలి తో పట్టి దప్పిక తీర్చు
అర చేతిలో సూర్యుని ఆపలేమని తెలిసి
ఆంధ్రులు / అందరు తెలివి తక్కువుగా ప్రవర్తిస్తున్నారు
నీ పిడికిలి బిగియిస్తే నీ కందరు దాసోహం
నీ వొక్కడివీ కాదు నీ కోసం నలుగురు
నీ తెలంగాణా కు పదుగురు
కలిసి సాగరా ముందుకు
కస్తాలను కడ తేర్చర మనకు
జై తెలంగాణా జై తెలంగాణా

ఎన్నడూ రాదా ఇక స్వాతంత్ర్యం

ఎవ్వరిది ఈ ఉద్యమం?
ఎప్పటిదీ ఉద్యమం?
ఎందుకీ ఉద్యమం?
మా కూడు మాకు దక్కాలని
మా నీరు మాకు దక్కాలని
మమ్ముల మేము పోషించుకోవాలని
మా పొట్ట కొట్టే వారిని వెలి వేయాలని
వాడెవ్వడు వాడెవ్వడు
మా అన్నం మెతుకు పై పేరు రాసేందుకు
వాడెవ్వడు వాడెవ్వడు
మా గొంతు నిండే దుకు
మో చేతి నీళ్లు తపెందుకు వాడెవ్వడు
ఎన్నడూ రాదా ఇక స్వాతంత్ర్యం
ఎంకేన్నల్లీ తెలంగాణా స్వాతంత్ర్య సమరం