26, నవంబర్ 2010, శుక్రవారం

ప్రేమ ఇక నువ్వు దరి చేరవ?

అడుగు అడుగున నీ ఆలోచనలే
అను నిత్యం నీ స్మరణే
ఆనందం పంచిన నీవు
ఆవిరై పోయావు ఎందుకు ?
నా ప్రేమను చులకన గ చేసి
నన్ను దూరం చేసావు ఎందుకు ?
ప్రేమ ఇక నువ్వు దరి చేరవ?
ప్రేమించే నన్ను నీ వాడిని కానివ్వవ?

రాయిలా మారింది హృదయం

రాయిలా మారింది హృదయం
రాగాన్ని మరిచింది గానం
అనురాగాన్ని పంచె తోడు లేనప్పుడు
అను నిత్యం ఆవేదనే
ప్రతీకారం దేవునిదా?
ప్రతిఫలం ఇంత మంది జీవితాలద?

ప్రేమ వదిలి వెళ్ళింది

నన్ను ప్రేమ  వదిలి వెళ్ళింది
నేను ప్రేమను వదల కున్నాను
కరిగి పోతూనే ఉంది కాలం
ఏ కాకి గానే ఉండాలా కల కాలం?
దైవ నిర్ణయానికి అంతం లేదా?
దీపం పెట్టె దేవత దరి చేరద?

గురువు

శివుడి ఆజ్ఞ తో
విష్ణువు ఆయువుతో
బ్రహ్మ రాసిన తల రాతతో
శిశువు జన్మిస్తే
తల రాతను మార్చేది గురువు
తల్లి జన్మ నిస్తే
తండ్రి నడక నేర్పిస్తే
నడిచే దారిని మంచి చేసేది గురువు

జీవితాంతం ఏకాకినే

నీవు చేసిన గాయం మాన్పెందుకు 
నీవు దూరం చేసిన ఆనందాన్ని తిరిగి ఇచ్చేందుకు 
దేవుడు పంపిన ఆత్మీయ భందువు 
ఏ క్షణం నా దగ్గరవుతుందో నని వేచి ఉన్నాను 
నీవు అడ్డురానంత వరకు తను నా సొంతమే 
అడ్డు వస్తే నేను జీవితాంతం ఏకాకినే

ప్రేమ నా అభిప్రాయం

ప్రేమ ఈ పదం ఎలా రూపం చెందిందో గాని ఆ పదాలను చుసిన విన్న ఏదో అందుర భావన మదిలో ఎవరు లేకున్నా ఆ పదం వినగానే ఎవరో మన మనసులో నిండి పోయారన్న ఒక స్పందన .ప్రేమను ఎందఱో ఎన్నో విధాల నిర్వచించి అలసి పోయారు . ఏ అర్థం దానికి చెప్పిన ఇంకేదో కొత్త అర్థం ఇవ్వాలని అని పిస్తుంది .ప్రేమ మనసుకు సంభందించినదా లేక మనిషి కి సంభందించినదా అని ఆలోచించిన సమాధానం రాదు.ఒక్కొకరికి ఒక్కో భావన .
 ప్రేమ పుడుతుంది  పెళ్లి అవుతుంది .మనిషి జీవితం లో జన్మించటం మరణించటం వీటికి ఉన్న ప్రాధన్యత ఎంతో అందరికి తెలుసు. ప్రేమ ఎన్నటికి పుడుతుందే తప్ప మరణించది.మనిషి రూపం లో మరణించిన మనసు రూపం లో అది ఎన్నటికి శాశ్వతం .ప్రతి ఒక్కరు ఎవరినో ఒకరిని ఎప్పుడో ఒక ప్పుడు ప్రేమించే ఉంటారు కాని ఆ నిజాన్ని ఒప్పుకోరు .ప్రేమించటం అంటే ఏదో తప్పు చేసామన్న భావన ఇంకా సమాజం లో ఉంది.
  ఎవరి మదిలోకి ఎవరు ఎప్పుడు ఎలా వస్తారో తెలియకుండానే జరిగి పోతుంది ఎన్ని ప్రేమ కథలు మనం చుసిన ఏదో ఒక కొత్త దనం కనిపిస్తుంది. ఎందుకు ప్రేమిస్తున్నాం అనే దానికి జవాబు దొరకక పోవడమే నిజమైన ప్రేమ .అంత రాత్మను మోసం చేసుకుని జీవితాంతం బ్రతికి చావడం కంటే,అంత రాత్మ లో నింపుకున్న ఆ ఆత్మకు అను నిత్యం తోడుండి కల కాలం బ్రతకటం మంచిది. ఎవ్వరు మనసును మోసం చెయ్యద్దు అనుకుంటూనే మోసం చేస్తున్నారు. ప్రేమించిన వారికి ప్రేమను తెలియ జేయడం చాల ముఖ్యం .ప్రేమను ధైర్యంగా చెప్పక పోతే లక్ష్మి మన సొంతం కాదు.అమ్మాయిలైనా ,అబ్బాయిలైనా ప్రేమను వ్యక్త పరచాగలిగే ధైర్యం ఉండాలి.
   ఎన్నో విధాల వ్యక్త పరచగలది ఒక పేమ మాత్రమే. మనసు పవిత్రంగా ఉన్నంత వరకు మన అధీనం లో మనం ఉన్నత వరకు ప్రేమ చాల గొప్పది . ప్రేమించడాని కచ్చితంగా ఒక నిర్ణీత వయస్సు కావాలి .తిన్న ఆహారం విసర్జించక పోతే ఎంత ప్రమాదమో ప్రేమను వ్యక్త పరచక పోతే కూడా అంతే ప్రమాదం.ప్రేమను వ్యక్త పరచటం లో అమ్మాయిలే నిజంగా ధైర్య వంతులు.అబ్బాయిలని ఎక్కువ గ ప్రేమించి తక్కువగా అర్థం చేసుకోవాలి కాని అమ్మాయిలని తక్కువగా ప్రేమించి అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేసినా వారు అర్థం కారు ఎందుకంటే "ఆడ వారి మాటలకు అర్థాలే వేరులే". ప్రేమికులలో ఉండే భావనలు ఎలా ఉంటాయి అంటే ,వాళ్ళు అర్థం చేసుకునే విధానం ఎలా ఉంటుంది అంటే ,తన ప్రేయసిని ఇంకో అబ్బాయితో మాట్లాడితే అమ్మాయిని అనుమానిన్చినట్టు .కాని అబ్బాయి ఇంకో అమ్మాయితో మాట్లాడ వద్దు అంటే మాత్రం అది అబ్బాయి మీద ఉన్న అతి ప్రేమ అని అంటారు.
 ఈ రోజుల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే ప్రేమలో ఎక్కువ స్వచ్చత చూపిస్తున్నారు .

18, ఆగస్టు 2010, బుధవారం

కష్టా లన్నీ నాకే

కష్టా లన్నీ నాకే ....! కష్టాలు వచ్చ్సినపుడు ప్రతి మనిషి నోట వచ్చే మాట ఇది.కాని అదే  సుఖాలు వచ్చినపుడు సంతోషాలన్నీ నాకే అని అనలేడు. కష్టం  వచ్చినపుడే మనిషిని సృష్టించిన దేవుడు .మనిషి సృష్టించిన డబ్బు ,మనిషి కి తోడు గ ఇంకో మనిషి గుర్తు వస్తాయి. అక్కరకు వస్తాయి .సంతోషాన్ని స్వీకరించినంత ఇష్టంగా కష్టాన్ని స్వీకరించలేదు మనిషి .కష్టం లేనప్పుడు సుఖం విలువ తెలియదు. ఈ విషయం లో దేవుడు సృష్టించిన మనిషి కంటే మనిషి సృష్టించిన డబ్బు కే విలువ ఎక్కువ  అయింది .పెద్ద మనసు చేసుకుని ఒక పెద్ద మనిషి మనస్పూర్తిగా సాయం చేసినా అది దైవం యొక్క ఆశీర్వాదం అని అనుకుంటున్నాం.పాపలు చేసిన వాడికే కష్టాలు  కల్పిస్తాడ దేవుడు?లేక దేవుడు పరీక్ష పెట్టడానికి కష్టాలు కల్పిస్తాడ? ఏది ఏమైనా కష్టాలు వచ్చినపుడు తట్టుకోవడం చాల కష్టం.
         సుఖం ఉన్న చోట మనిషికి విలువ  ఉండదు.సుఖం అంటే ప్రస్తుతం చేతి నిండా డబ్బు ఉండటమే అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది.డబ్బు అవసరం లేని మనిషి ఉండదు.అదే పద్దతిని దేవుడికి అంట గట్టేస్తున్న్రు. ఈ రోజుల్లో దైవ దర్శనం కూడా డబ్బుతోనే ముడి పది ఉంది.అమాయుకులైన చిన్న పిల్లలు సహితం ఒక్క రూపాయి ఇస్తేనే  మనతో సంతోషం పంచడానికి ముందుకు వస్తారు .ప్రపంచం అంత పొట్ట కుతి కోసం కోటి విద్యలు నేర్చారు అనేకంటే డబ్బు సంపాదించడానికే కోటి విద్యలు నేర్చారు అనడం లో అతిషేయోక్తి లేదు .డబ్బు లేని వానికి ఆకలి ఎక్కువ డబ్బులున్న వాడికి అసలు తినే సమయం తక్కువ .ఎంత విచిత్రం ఇక్కడ కోటి విద్యలకు ,కూటి ఆకలికి ఎంత సంభందం ఉంది?
        డబ్బు లేని వానికి కష్టాలు ఎక్కువ సుఖం తక్కువ .ప్రతి రోజు ఉన్న కోటి విద్యల్లో ఏదో ఒక విద్య ఉపయోగించి కష్టపడి ,పొట్ట నిండా తినకున్న సుఖంగా నిద్రపోగాల్డు.నిద్ర విషయం లో డబ్బు లేని వానికే సుఖం ఎక్కువ .డబ్బు ఉన్న వానికి ప్రతి రోజు ఈ రోజు డబ్బులెలా వస్తాయి అనే ఆలోచన ఉండదు కాని తినడానికి సమయం ఉండదు.సుఖంగా జీవించడానికి అన్ని సదుపాయాలూ ఉంటాయి కానీ ఉన్న డబ్బు నే ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచన తో సుఖంగా నిద్ర పోలేడు,తిన లేడు.కష్టం దేవుడిచ్చిన శాపమా?సుఖం దేవుడిచ్చిన వరమా తేల్చడం కూడా మరో కష్టం .కాబట్టి సుఖం ఎంత ముఖ్యమో ,కష్టం కూడా అంతే ముఖ్యం.ఎప్పుడు సుఖాలు ఉంటె కష్టం వచ్చినపుడు తట్టుకోవడం వాళ్ళ కాక ఎలాంటి అఘాయిత్యానికైనా పాలపదతాడు మనిషి.కష్ట సుఖాలు రెండు జీవితం లో అవసరమే.
 


 

20, మార్చి 2010, శనివారం

ప్రేమ పెళ్లి -పెద్దల పెళ్లి

           ప్రేమను పంచి ,ప్రేమగా చూసుకునే తోడు లభించిన నాడు ఎంతో అదృష్టం .ఎవరు ఎన్ని చెప్పిన వినిపించని మనిషికి తోడు మనసు .ప్రేమలో పడితే సర్వస్వం ప్రేమించిన మనిషే .తీసుకున్న నిర్ణయం ఆలోచన ఉంది తీసుకున్నప్పుడు ఉన్న ధైర్యం  ఎంతకైనా తెగించేలా చేస్తుంది.ఎవరిఅనైనా ఎదిరించేలా చేస్తుంది .ప్రేమ పెళ్లి కి ,ప్రేమికులకు సమాజం లో ఎప్పుడు చిన్న చూపే .పంచె ప్రేమ నిస్వార్థం గా ఉన్నన్ని రోజులు ఎవరు ఎన్ని చెప్పినా ,ఎవ్వరు విడదీయ లేరు. మరి ఈ పిల్లల ప్రేమకి  ఎన్నో అడ్డంకులు ఏదో ఒక రూపం లో ఉండనే ఉన్నాయి. తల్లిదండ్రులు పంచె ప్రేమను మరచి ప్రేమికులు తమకు తాము ఎన్నో ఊహించుకుంటారు .ప్రేమికుల దృష్టిలో ఒకరంటే ఒకరికి ఎంతో నమ్మకం మున్ముందు జీవితం లో ఎలా ఉంటారో అనే ఒక మానసిక సంఘర్షణ పెద్దలను ఎప్పటికి వేధిస్తుంది .ఆ ఆవేదనే ప్రేమికుల ప్రేమకు అడ్డుగా నిలుస్తుంది .తల్లి దండ్రుల అనుభవం ,ప్రేమికుల అనురాగం ఈ రెంటి మధ్య మొదలయ్యే యుద్ధం ఎవరికీ వారు తమ తమ నిర్నయాలనుంది సడలరు. ప్రతిఫలంగా ప్రేమికులైతే ఒకటవు తారు కాని ,పెద్దల దృష్టిలో దోషులవుతారు .ప్రేమ పెళ్లి పెద్దల పెళ్ళిగా మారితే ఆ ఆనందం అందరిది .

    ప్రేమించిన వారిని ఎందుకు,ఎప్పుడు ప్రేమించామో తెలియదు .ఈ నిమిషంలో మనసులో ఆ అనుభూతి కలుగుతుందో,ఆ నాటి నుండి పెద్దల దృష్టిలో వాళ్ళు దొంగలు.ప్రేమికుల దృష్టిలో వాళ్ళు భావిష్య్యతు  గురించి బేరీజు వేసుకునే అంశాలు చాల తక్కువ .కాని ఇక్కడ ఉన్న ఒక సదుపాయం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ,ఏ నాడు అయితే ఆ అర్థం ,అపార్థం అవుద్దో ఆ నాడు ప్రేమికులు విడి పోతారు.ఈ విషయం లో నే పెద్దలు ఆందోళన చెందేది .పెద్దలు నిర్ణయించే పెళ్లి లో వారి అనుభవాన్ని జోడించి జీవిత భాగస్వామిని నిర్ణయిస్తారు .పెద్దల పెళ్ళిలో నిర్ణయాలు తీసుకునే సర్వాదికారం పెద్దలవే. ఎన్ని సంభందాలు చూసినా ,అమ్మాయి అబ్బాయిలు తీసుకోవాల్సిన నిర్ణయం ఒక్కటే అది ఒకరికి ఒకరికి నచ్చటం ఇక్కడ అమ్మాయి ,అబ్బాయి అందానికి ఒక ప్రాధాన్యత అయితే (ఈ ఒక్కటి మాత్రమె పిల్లల నిర్ణయం )ఆస్తి ,అంతస్తులు ,కట్నం మరో అంశం .ఒకరికి ఒకరు నచ్చినా పెద్దలు తీసుకునే నిర్ణయమే ముఖ్యం .ఇక్కడ పెద్దలు ,పిల్లల దృష్టిలో దోషులవుతారు అలాగని పెద్దలని తప్పు పట్టాల్సిన పని లేదు .ఎందుకంటే పెద్దలు ఆలోచించేది పిల్లల భవిష్యత్తు గురించే .ప్రేమ పెళ్లి లో ప్రేమికులు అసలెందుకు ఇలా చేస్తున్నారో అని పెద్దలకు అర్థం కాదు. పెద్దల పెళ్ళిలో పిల్లలకు పెద్దలు ఇలా ఎందుకు చేస్తున్నారు అర్థం కాదు .ప్రేమ పెళ్లి లో ప్రేమికులు ఒకరికి ఒకరు నచ్చి ,అర్థం చేసుకుని పెద్దలకు నచ్చ జెప్పినా పెద్దలకు ఆ ప్రేమ అర్థం కాకున్నా పెళ్లి జరుగుతుంది కాని పెద్దల పెళ్ళిలో ఒకరికి ఒకరు నచ్చినా పెద్దలకు అర్థం(కట్నం ) అయితేనే పెళ్లి జరుగుతుంది.




     

 

13, మార్చి 2010, శనివారం

అభిమానాన్ని పంచేది

అభిమానాన్ని పంచేది
ఆనందాన్ని ఇచ్చేది నీనైతే
అలుసుగా చూసేది
ఆత్మీయతను చంపేది నీవు
చూపించిన ప్రేమనంతా
ఛీ కొట్టి పోయావు
మురిసిన మనసులో అంత
అలజడే సృష్టించావు
చచ్చిన పామునే చావా బాదే
ఖతినాత్మురాలిగా మారావు.

పలికించు నీ నాదం

పలికించు నీ నాదం
పది మందికి వినిపించేలా
మానస సరోవరం
మరోమారు ఉప్పొంగేలా
కోయిలమ్మ గానం లా
మైమరపించే నీ సరాగం
గొంతెత్తి పాడే సమయం
గోకులమంత పరవశం
నలు దిక్కులా నీ నామం
మారు మ్రోగాలి ఈ యుగాంతం

అమ్మ నా ఆనందాన్ని

అమ్మా నా ఆనందాన్ని ఆపింది ఎవరు ?
ఆటలాడే చిన్ని తనాన్ని చిదిమింది ఎవరు ?
ఇల్లు నే ఒక భందిఖానగా మార్చింది ఎవరు ?
ఈ రోజు ఆడుకో అని చెప్పేది ఎవరు ?
ఉడుతలా గెంతకుండా చేసింది ఎవరు ?
ఊయలూగుటకు స్థలం లేకుండా చేసింది ఎవరు?
ఎన్నాళ్ళు ఉండేది ఈ బాల్యం ?
ఎం కావాలి నా భవితవ్యం ?
ఒళ్ళు అలవకుండా
ఓనమాలు ఎలా దిద్దటం
ఔదార్యం లేని చదువెందుకు చదవటం ?
అందరు ఆలోచించండి
ఆః అనేలా మము తీర్చిదిద్దండి .

10, ఫిబ్రవరి 2010, బుధవారం

తెలంగాణా రాజకీయాలు

తెలంగాణా రాజకీయాలు

తెలంగాణా ఉద్యమం ఘన చరిత్ర సృష్టించడానికి జరుగుతుందా? తెలంగాణా రాష్ట్ర సాధన కోసం జరుగుతుందా? ఐక్య కార్యాచరణ సమితి అంటే అంత ఐక్యంగా ఉండడమే కదా? అలాంటప్పుడు మల్లి ఇందులో విభజించబడిన ఐక్యత ఎందుకు ? రేపు తెలంగాణా వస్తే కూడా ఉండేది ఇదేనా?ఇప్పుడే సమయం దొరికినాటు కొంత మంది అప్పుడే కులమతాల గురించి సభాముఖంగా తగువులాడుతున్నారు."ఆలు లేదు చులు లేదు కొడుకు పేరు సోమలింగం లా ఉంది పరిస్థితి." ఎవరికీ వారు ఐక్య కార్యాచరణ సమితి అంటున్నారు కాని ఐక్యత మాత్రం లేదు.అసలు ఇలా ఎవరికీ వారు ఐక్య కార్యాచరణ సమితి స్థాపించడం ఎందుకో ? కార్యం సాధించడానికా లేక మరి దేనికోసం?

అటు సీమంధ్ర వాళ్ళు ఇంకా ఏదో చేద్దామని పరుగులు తీస్తున్నారు ఎందుకో? చరిత్రను పట్టుకుని వేలాడుతున్నామని నిదించినా,భవిష్యత్తు కి నమ్మకం ,ఆశ, స్థైర్యం లేదనే తెలంగాణా ఉద్యమం జరుగుతుంది. ఇన్నాళ్ళు జరగనిది ఇక ముందు ఎలా జరుగుతుంది అనే ఈ ఉద్యమం .ఈ ఉద్యమం లో సమిధలైన విద్యార్థులు కోసం అయినా సీమాంధ్రులు మారుతార? మారారు. రాజీనామా చేస్తే తెలంగాణా వస్తుంది రాజీనామా చేయమంటే ,రాజకేయ సంక్షోభం వస్తుంది,ప్రభుత్వం పడిపోద్ది,రాష్ట్ర పతి పాలన వస్తది అని అంటున్నారు .రాజకీయ నాయకులు.మరి ఈ విషయం ఇంతకు ముందు రాజీనామా చేసినప్పుడు తెలియడ? తెల్నగన రాజకీయ నాయకులు రాజీనామా చేస్తే ,రాజకీయ సంక్షోభం వచ్చి ,రాష్ట్ర పతి పాలనకి దారి తీస్తే మరి ఇది సీమంధ్ర రాజకీయ నాయకులకు వర్తించద?
గోడ మీద పిల్లి ల వ్యవహరిస్తున్న పార్టీలు ,కేంద్రం విద్యార్థులు జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఈ బలిదానాలు కొంత మంది సీమంధ్ర పాలకులకు క్రికెట్టు స్కోఋ లా కనిపిస్తున్నాయి . ఆత్మ హత్యా చేసుకుంటే అదేమైనా గొప్ప ?అని అడిగే సీమంధ్ర గొంతులు ఉన్నాయి.సమైక్యత రాగం అందుకున్న సీమంద్రుల ఉద్దేశాలేంతో తెలంగాణా ప్రజలకు బాగా తెలుసు .తెలంగాణా అభివృద్ధి చెందినదా ,హైదరాబాద్ అభివృద్ధి చెందినదా?ఎవరి అభివృద్ధి దేనికి కారణమైంది ?హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణా ప్రజల పొట్ట కొట్టి ,నోట్లో మట్టి కొట్టి చేసిందే ఈ అభివృద్ధి అంత.కొన్ని పార్టీలు సామాజిక తెలంగాణా కావలి అని ,సీమంధ్రులు చేపట్టిన ఉద్యమాన్ని చూసి ప్రజల్లో ఇంత బలమైనా కోరిక ఉండనుకోలేదు అంటున్నారు.మరి తెలంగాణా వాళ్ళు ప్రజలు కాదా?

సీమంధ్రలో ,వారసత్వంగా ఆస్తులు ఇష్టరేమో కాని ,తెలంగాణా లో పోరాటాలను వారసత్వంగా ఇస్తారు .తెలంగాణా అంత ఉద్యమ చరిత్రే.షరతుల ప్రకారం తెలంగాణా లో కలిసిన సీమంధ్రులు పదే పదే షరతులను ఉల్లంఘిస్తారు .విడి పోవడానికి మాత్రం ఒప్పుకోరు . సీమంధ్ర పాలకుల స్వీయ అభివృద్ధి ని హైదరాబాద్ అభివృద్దిగా చూపుతూ సమైఖ్య"ఆంధ్ర" కావాలని మూర్ఖంగా మాట్లాడుతున్నారు.తెలంగాణా ఉద్యమం తెలంగాణా రాష్ట్రం వచ్చాకే ఆగి పోతుంది .ఇప్పటి పరిస్థితులు తెలంగాణా రావడానికి దారి తీయకున్న ఈ ఉద్యమం మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటుంది .సీమంధ్రులు ఏదైనా మాట్లాడేది ఉంటె మా పొట్ట కొట్టి వారు అభివృద్ధి చేసామని చెప్పుకుంటున్న హైదరాబాద్ గురించి మాట్లాడాలి కాని, సమైఖ్యాంధ్ర గురించి కాదు.

9, జనవరి 2010, శనివారం

జనం ఎప్పుడు ఇంతే

జనం ఎప్పుడు ఇంతే
మరువకండి మన లక్ష్యం .

జనం ఎప్పుడు ఇంతే చచ్చినాక మరచి పోవడానికి జన నాయకుడిలా ప్రచారం చేయబడ్డ జన నాయకుడి చావు ల కారాదు మన ఉద్యమం. మనకు ద్రోహం చేసారని మనకు ద్రోహి గా తెలిసినా విధ్వంసం సృష్టించిన పిచ్చి జనాలు.ఉద్యమం ఉవ్వెత్తుగా ఎగసినా ,ఉసురుమనిపించిన రాజకీయ చతురత ఉన్న రాజకీయ నాయకుల నమ్ముకున్నం.మన బాగు కోసమే అని ఆందోళనలు ఆవిరి చేసినా నిరసనలు నీరసించి పోరాదు.సమైఖ్య అన్న పదానికి అర్థం తెలియక చేసే ఉద్యమాలలో ,తెలంగాణాకి సంప్రదింపుల పేరుతో సమాధి కట్టే యత్నం చేస్తున్నారు .ఎన్ని సార్లు ఈ కమిటీలు ,సంప్రదింపులు జరిపినా తెలంగాణాకి మళ్లీ మళ్లీ జరిగే మోసం పెరుగుతుందే కాని తరగదు.ఆంధ్రులు మాత్రమె ఆరంభ శూరులు అది గుర్తుంచుకోవాలి .ఇన్నాళ్ళు అన్యాయం చేస్తుంటే మీ పాలకులు ఏమి చేస్తున్నారనే ప్రశ్న మనకు ప్రతి సారి ఎదురయ్యింది .నమ్మకంగా రాజకీయాన్ని నమ్మితే మళ్లీ ఎ రాజకీయం చేస్తారో? రాజకీయాలను జనం నడుపుతున్నారా? జనాన్ని రాజకీయం నడుపుతుందా?జనం నాకు ఎందుకు లే అనుకున్న ప్రతి సారి రాజకీయ నాయకులే జనాలను నడిపినారు .ఈ సారి జనం రాజకీయ నాయకుల నడుపుతారు అనుకున్నారు జనం. జనం ఇంకా ఇలా నే జోగుతుంటే మళ్లీ జనాన్ని రాజకీయన నాయకులే నడుపుతారు .ఎవరు మాట్లదోద్దన్నారని ఎవరూ మాట్లాడటం లేదు? ఉద్యమానికి ఉపిరి వదిలిన వారికి సంతాపం కోసం మౌనంగా ఉండాల్సిన సమయం ఇది కాదు మన మాటల్లో విధ్వంసం ఉంటె వాళ్ళ చేతల్లో వినాశనం ఉంది.జయ జయ హే తెలంగాణా జననీ జయ కేతనం అని పాడుకుంది మున్నాళ్ళ ముచ్చట కోసం కాదు.ముదిమి నవ్వులు చిందే బంగారు భవిత కోసం.

ఎవరిని నమ్మి ఆపినాము ఉద్యమాన్ని ?ఎవరికోసం నడిపినాము ఈ పోరాటం? నాయకుడు దొరక ఆపినామా?
నాయకుడు అలిసినాడని ఆగిందా ఉద్యమం? ఒకరి వాళ్ళ ఒకరి కోసమే సాగిందా ఇదంతా? తప్పు మీది ,మీ పాలకులది అని వేలెత్తి చూపిస్తుంటే ఇంకా మనం ఇల్లాగే ప్రవర్తిద్దమా? చిత్త శుద్ధి గురించి పాలకులను ప్రశ్నించే మనం మన చిత్త శుద్ధి ని ప్రశ్నించుకుందాం. ఇప్పుడు రాక పోతే ఇంకెప్పుడు రాదనీ తెలిసి ఇప్పుడు లేక పోతే ఇంకెప్పుడు లేదని తెలిసి ఇంకా ఎందుకీ అలసత్వం ?ఇంకా పోరాడుతూనే ఉందామా? మన తాతల పౌరసత్వాన్ని ,మన మనుమలకు అందిద్దమ?ఎన్నికలప్పుడు మాకు ఇది అడ్డం ,అది అడ్డం అని అంటారు .ఎన్నికలయ్యాక ఏకాభిప్రాయ సాధన అంటారు .కలిసి ఉంటె కలదు సుఖం అనే జన్నల్లో ఎంత మంది తమ సొంత అన్నదమ్ములతో ,వారి తల్లి తండ్రులతో కలిసి ఉన్నారో ,కలిసి ఉండి ఎంత మంది సుఖంగా ఉన్నారో తెలియదు.ఇన్నాళ్ళు కలిసి ఉన్నా ఎవరూ శుకంగా లేరనే అందరు అంటున్నారు అయినా ఇంకా కలిసే ఉందాం అంటున్నారు.
మనం మన కోసం పోరాడుతున్నమ?మన రాజకీయ నాయకుల కోసం పోరాడుతున్నమ?నడకలో కాలి కి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు తీయాలి కాని కాలిని కాదు .అలా గే ఏవో అడ్డంకులు చూపిస్తున్న వారిని అడ్డం తొలగించుకోవాలి కాని ఉద్యమాన్ని ఆపుకోరాడు .అభివృద్ధి కుంటు పడుతుందని ఉద్యమం ఆపమన్నా ప్రభుత్వం ఇన్నాళ్ళు మన జీవితాలు కుంటు పడుతుంటే ఏమి చేసారో? జీతాలివ్వడానికే డబ్బులు చాలవన్నవి మాటలైతే స్విస్ బ్యాంక్ మూలుగుతున్న డబ్బు ఎవరి జీవితాలను బలియిచ్చి సంపదిన్చినారో ?విద్యార్థులు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దనే పాలకులు ,ఆ భవిత కోసం అసలు పునాదులే సరిగా నిర్మించలేదు .కడుపు మాది నోడి కేక "అమ్మా ఆకలి" కడుపు నిండి నోడి కేక "గురక" ఆకలి కేక ఎంతకైనా తెగించేలా చస్తుంది .ఆకలి కేక లోని దీనత్వం ఆకలి తీరినోడికి అర్థం కాదు .ఆకలి తీర్చ చేతాకాదు.పాలకుల నిల దీసి పని చేయించుకోవాలి కాని పాలకుడు లా మనం ప్రవర్తించ రాదు.తెలంగాణా వీరుడా జర భద్రం.