2, డిసెంబర్ 2009, బుధవారం

ఎందుకిలా చేశావు

ఎందుకిలా చేశావు
ఎదను వదిలి ఎందుకు వెళ్ళావు
ఇన్నేళ్ళ మన అనుభందాన్ని
ఇలా దూరం చేసావు
పరిమళించిన మనసుకు
పాడి ఎందుకు కట్టావు
మనసు లోని మందిరం వదిలి
మాసి పోయిన మంటపాన్ని మిగిల్చినావు
ప్రేమను జయించి పెళ్లి చేసుకున్దామను కుంటే
ఓడించి ఒంటరి తనాన్ని మిగిల్చినావు

30, నవంబర్ 2009, సోమవారం

జై తెలంగాణా (ఇది కవిత కాదు )

జై తెలంగాణా
-Another freedom fight in "ANDHRA" prdesh
ఉద్యమం అనేది ఎప్పుడు వచ్చిన అది జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించడానికే ఇది జగ మెరిగిన సత్యం. ఇప్పటికి ఎన్నో ఉద్యమాలు జరిగాయి అందులో తెలగాణ కోసం జరుగుతున్న ఉద్యమం ఈ నాటిది కాదు. స్వాతంత్ర్యం కోసం భారత దేశం సాగించిన ఉద్యమం ఇంకా 'ఆంధ్ర' ప్రదేశ్ లో సాగుతూనే ఉంది. బ్రిటిష్ పాలనలో కూడా అన్యాయానికి గురికాని తెలంగాణా ప్రజలు బ్రిటిష్ వాళ్లు కూడా పరిపాలించని ,పరిపాలించే అవకాశం రాని చోట ఆంధ్ర వాళ్లు తెలంగాణాని పరిపాలిస్తూ తెలంగాణా ప్రజలను అన్యాయానికి గురిచేస్తున్నారు.
తెలంగాణా ఉద్యమం ఉధృతమైన ప్పుడల్లా ఆంధ్ర ప్రజలనుండి వచెది ఒకే ఒక మాట " తెలుగు వారంతా ఒక్కటే అని" ఆంధ్ర వాళ్లు తెలగాణ లో పెట్టు బడులు పెట్టారని. ఆ మాటకి వస్తే భారత దేశమంతా ఒక్కటే ,ప్రపంచమంతా ఒక్కటే ఎవరైనా ఎక్కడైనా ఉండవచు ,పెట్టు బడులు పెట్ట వచ్చు. కాని అన్యాయమైన విషయమేమిటంటే ఎవడో తెలియని వ్యక్తి మీ ఇంటికి వచ్చి మీ మీద అజమాయిషీ చేస్తే ఎలా ఉంటుందో ,ఇప్పుడు తెలంగాణలో జరుగుతుందీ అదే.
తెలంగాణా కోసం ఉద్యమించే నాయకులని తప్పు పడుతున్నారు ఏమంటే "తెలుగు ప్రజలంతా ఒక్కటే అని "
తెలంగాణా కోసం ఉద్యమించే ఉద్యమం పద్దతి కాదు అని అనుకుంటే భారతదేశ స్వాతంత్ర్యం కోసం చేసిన ఉద్యమాన్ని ,పొట్టి శ్రీ రాములు చేసిన ఉద్యమాన్ని కూడా తప్పు పట్టాల్సి వస్తుంది. ఎలా అంటే ఆంధ్ర ప్రజల మాటల ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ఉండవచు ,పెట్టు బడులు పెట్ట వచ్చు కదా ఆ విధంగానే బ్రిటిష్ వాళ్లు వచ్చారు పెట్టు బడులు పెట్టారు .వాళ్ళని వెలి వేయడం లో లేని తప్పు తెలంగాణా కోసం చేస్తే తప్పేంటి ?బ్రిటిష్ వాళ్లు కూడా ఇక్కడ పెట్టు బడులు పెట్టారు ప్రాజెక్ట్స్ కట్టించారు .అదే సమయాన మన దేశాన్ని కొల్ల గొట్టారు ఇప్పుడు ఆంద్ర ప్రజలు చేస్తుంది కూడా అదే .
ప్రజలంతా ఒక్కటే అయితే పొట్టి శ్రీ రాములు తెలుగు వారి కోసం ఎందుకు ఉద్యమిన్చాల్సి వచ్చింది? పరిపాలన సౌలభ్యం ,భాష ప్రయుక్త రాష్ట్రం కోసం పొట్టి శ్రీ రాములు తప్ప ఇంకెవరు ఉద్యమిన్చాలేదే? తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం ఈ నాటిది కాదు .చారిత్రాత్మకంగా జరుగుతుంది. బ్రిటిష్ వాళ్లు పరిపాలిస్తున్నప్పుడు తెలంగాణా ప్రాంతాన్ని వారు ఆధీనం చేసుకోలేదు .నిజాం ప్రభువు పరి పాలించాడు .దేశానికి స్వాతంత్ర్యం ౧౯౪౭ (1947) ఆగష్టు ౧౫ (15) న వస్తే తెలంగాణా కి ౧౯౪౮ (1948) సెప్టెంబర్ ౧౭ (17) న వచ్చింది .(నిజంగా అయితే ఇప్పటికీ తెలంగాణా కి స్వాతంత్ర్యం రాలేదు) అది కూడా భారత ప్రభుత్వం సైనికులతో బలవంతంగా చేసిన పని వలన .౧౯౫౬ (1956) లో "ఆంధ్ర" ప్రదేశ్ ఏర్పడింది .పెద్ద అమ్నుషుల ఒప్పందం ప్రకారం ఇది జరిగింది .పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం (gentle men's agreement) ఆంధ్ర- తెలంగాణా రాష్ట్రం గ ఉండాల్సింది "ఆంధ్ర " ప్రదేశ్ మారింది. ఇలా జరగ దానికి ముఖ్య కారణం "ఆంధ్ర" ప్రాంత కాంగ్రెస్ నాయకులు .1947 తర్వాత కాంగ్రెస్ ఎక్కువగా ఆంధ్ర ప్రాంతాన జరిగింది కారణం ఇక్కడి నిజాం పభువు తెలంగాణాలో కాంగ్రెస్ ని అభివృద్ధి చెంద నీ య లేదు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ముఖ్య మంత్రుల ఎంపిక ఒక సారి ఒక ముఖ్య మంత్రి ఆంధ్ర నుండి ఉంటే ఉప ముఖ్య మంత్రి తెలంగాణా నుండి ఉండాలి .మరియొక సారి ఒక ముఖ్య మంత్రి తెలంగాణా నుండి ఉంటే ఉప ముఖ్య మంత్రి ఆంధ్ర నుండి ఉండాలి .కాని ఇలా జరగట్లేదు జరగలేదు .మొదటి ముఖ్య మంత్రి ఆంధ్ర నుండి ఉన్నాడు కాని తెలంగాణా కి ఉప ముఖ్య మంత్రి పదవి ఇవ్వలేదు . అప్పటి నుండే తెలంగాణా కి అన్యాయం జరుగుతుంది ఇంకా జరుగుతూనే ఉంది .
అప్పటి నుండి నుండి వస్తున్న ప్రతి ప్రభుత్వం ఆశ చూపి పబ్బం గడుపుతునే ఉంది. ౧౯౬౯ (1969) లో మల్లె మర్రి చెన్న రెడ్డి ఉద్యమం మొదలెట్టాక ఇప్పటికి సరైనా న్యాయం జరగట్లేదు .ఆ నాడు జవహర్లాల్ నెహ్రు నోట "అమాయకు లైనా తెలంగాణా ని ఆంద్ర వాళ్ళతో కలిపెస్తున్నం .ఎప్పుడు నచాకున్న విదిపోవాచు అని". ఆ రోజు నెహ్రు ఆంద్ర వాళ్ల కుటిల తెలివి గ్రహించి అన్నాడేమో ఏమో కాని నిజమే అన్నాడు.
కే చ ర ఉద్యమం ఉద్యమం మొదలెట్టాక సంతోషించాల్సిన కొన్ని విషయాలు ఏమిటంటే UPA common minimum programme లో తెలంగాణా అంశానికి ప్రాముఖ్యత ఇవ్వడం .దానికి ap congress support చేయడం కాని రాష్ట్ర ముఖ్య మంత్రి రాజ శేఖర రెడ్డి మోసం చేసి "తెలంగాణా వస్తే తెలంగాణా లో విదేశీ యుల్ల బ్రతాల్సి వాస్తుని అనడం "ఎంత కుటిల రాజకీయమో అర్థం చేసు కోవచు. ఆ తర్వాత పార్టీ లైన తెలుగు దేశం, భాజపా తెలంగాణా ఆవశ్యకతను గుర్తించి తెలంగాణా కోసం సహక రించి నట్టే సహక రించి వెనకడుగు వేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితి మంచికి దారి తీసి "తెలంగాణా కి స్వాతంత్ర్యం వస్తే ఎంతో బాగుంటుంది".



29, నవంబర్ 2009, ఆదివారం

ఆది భిక్షువే అడిగి ఉంటే ప్రేమను

ఆది భిక్షువే అడిగి ఉంటే ప్రేమను భిక్షగా
ఆది శక్తి ఇచ్చేదా ప్రేమను వరంగా?
అపర్ణ పరాశక్తి చేస్తేనే కదా కఠోర దీక్ష
ప్రసాదించాడు వరాన్ని అర్థ నారీశ్వరుడుగా
ఎన్నటిదో ఆ వరం ప్రేమని చేసాడు ప్రేయసికి ఆధీనం

గుప్పెడంత గుండె

గుప్పెడంత గుండెకి ప్రేమ ఓ ఉప్పెన
గూడు చెదర గొట్టి కన్నీటిని మిగులుస్తుంది
గుండెల్లో నింపుకున్న ప్రేమ ప్రాణంగా ఉంటే
ప్రేమించే ప్రేయసి ఆయువును నింపుతుంది
ప్రేమ పిచి వాన్ని చేసే ప్రేయసి ఉంటే
ఆ ప్రేమే ప్రియుడి ప్రాణాలు తీస్తుంది

సారధ్యం

సారధ్యపు ప్రగతికి సాధన కావాలి
సాధించే మనసున్న స్వాగతించే హృదయం కావాలి
సాహసించి చేరుకున్నా సమస్యలను అధిగమించాలి
సమస్యను ఎదుర్కొన్నా పరిష్కారం న్యాయంగా ఉండాలి
సారూప్యత లేకుండా అందరినీ సంతోష పెట్టాలి .