18, డిసెంబర్ 2009, శుక్రవారం

న్యాయంగా పోరాటం చేస్తే నారాయణు డవుతాడు

న్యాయంగా పోరాటం చేస్తే నారాయణు డవుతాడు
నక్క జిత్తుల పోరాటం చేస్తే నారడుదవుతాడు
నారాయణుడు దేవుడు అయితే
నారదుడు అగ్గి పుల్ల స్వామి అయినాడు
తెలంగాణా ప్రజల ఉద్యమం దేవుడు మెచ్చింది
ఆంధ్రుల ఉద్యమం రాక్షసానందం కోసం చేసేది
బ్రతుకు తెరువు కోసం పోరాటం లో ప్రాణాలు కోల్పోతే
శవ రాజకేయం చేసి పొట్ట నింపుకుంటున్నారు
కన్నీరు రాల్చినా దాన్ని పన్నీరు గ మార్చుకుంటున్నారు
దారిద్ర్యం ఇక్కడ రాజ్యమేలితే ధనం తో అక్కడ వర్ధిల్లు తున్నారు
నీరు లేక భూమి నీరసించి పోతుంటే
నిత్యం పంటలతో నిలువెత్తు సంపదను పోగేసుకుంటున్నారు
ఇది మా ఏడుపని మీరను కుంటున్నారు
అది మా కడుపు కొట్టి నింపు కుంటున్నారని మేమంటాము.

పోరు చేస్తుంటే పొట్ట కూటి కోసం

బ్రతుకు భార మైంది ఆంధ్రుల రాజ్యాన
బలుసాకు కరువైంది వీరు చేసే మోసాన
భయంగా ఉంది భూమి పోతుందేమోనని
నీరు దక్కకుండా నిలువు దోపిడీ చేస్తారేమోనని
నీడ మిగల కుండా నిలువుగా ముంచేశారు
కడుపు మీద కొట్టి కన్నీరు మిగిల్చారు
పోరు చేస్తుంటే పొట్ట కూటి కోసం
పోనీ అని వదలకుండా ఇంకా పెత్తనం చేద్దామని చూస్తున్నారు

16, డిసెంబర్ 2009, బుధవారం

ముద్దుకి ముహూర్తం అవసరమైతే

ముద్దుకి ముహూర్తం అవసరమైతే
మురిపెం కలిగిన ప్రతీసారి ముహూర్తం చూడాలి
కళ్యాణ ముహూర్తం కలిసివస్తే ఆగదు
కలిసి ఉంచే కళ్యాణ ముహూర్తం మన చేతిలో లేదు
పంచ ప్రాణాలకు ఆరో ప్రాణంగా నిను ఆహ్వానించినా
ప్రాణాలు తోడేసే మాటలతోనే ముహూర్త కాలం దాటి పోతుంది
వయసు వచ్చి వంటరితనాన్ని వద్దంటుంటే
ఈ వయసులో వలపే మనసుకు తోడంటావు

ఆగమాకు హృదయమా అంతు చూడు ప్రేమది

ఆగమాకు హృదయమా అంతు చూడు ప్రేమది
అడిగేవారు ఎవరు లేరు అంతు నీకు లేదా అని
అలుసు ఎవ్వరికి కాకుండా మూగ వాన్ని చేయి మనిషిని
ఆత్మ వంచన చేసుకోకుండా ధైర్య మివ్వు ప్రతి ఒక్కరికి
అంతు లేని ప్రేమ తో నింపి వేయి మనసుని
అందరికి నిరూపించు శ్వాస రూపం లో నిండి ఉంది నీవని

13, డిసెంబర్ 2009, ఆదివారం

దోచుకున్న ది చాల లేదా ఇంకా కావాలా

జననీ జనయిత్రి
తెలంగాణా నా ధరియిత్రి
జయిస్తానుస్వరష్ట్రాన్ని
జీవితాన్ని ధార పోసి
జలం దోచు కున్నారు
జనాన్ని దోచుకున్నారు
మా పొట్ట కొట్టి
మీ పొట్ట నింపుకున్నారు
ఉద్యమాలు మావి
ప్రతిఫలాలు మీవి
మీరు లేకుండా బ్రతక లేమనా?
మా బ్రతుకుల మీకు అంకితం చేయాలన
ఎందుకురా ఆంధ్ర వాళ మా మీద నీ దొంగ ప్రేమ
దోచుకున్న ది చాల లేదా ఇంకా కావాలా?