18, ఆగస్టు 2010, బుధవారం

కష్టా లన్నీ నాకే

కష్టా లన్నీ నాకే ....! కష్టాలు వచ్చ్సినపుడు ప్రతి మనిషి నోట వచ్చే మాట ఇది.కాని అదే  సుఖాలు వచ్చినపుడు సంతోషాలన్నీ నాకే అని అనలేడు. కష్టం  వచ్చినపుడే మనిషిని సృష్టించిన దేవుడు .మనిషి సృష్టించిన డబ్బు ,మనిషి కి తోడు గ ఇంకో మనిషి గుర్తు వస్తాయి. అక్కరకు వస్తాయి .సంతోషాన్ని స్వీకరించినంత ఇష్టంగా కష్టాన్ని స్వీకరించలేదు మనిషి .కష్టం లేనప్పుడు సుఖం విలువ తెలియదు. ఈ విషయం లో దేవుడు సృష్టించిన మనిషి కంటే మనిషి సృష్టించిన డబ్బు కే విలువ ఎక్కువ  అయింది .పెద్ద మనసు చేసుకుని ఒక పెద్ద మనిషి మనస్పూర్తిగా సాయం చేసినా అది దైవం యొక్క ఆశీర్వాదం అని అనుకుంటున్నాం.పాపలు చేసిన వాడికే కష్టాలు  కల్పిస్తాడ దేవుడు?లేక దేవుడు పరీక్ష పెట్టడానికి కష్టాలు కల్పిస్తాడ? ఏది ఏమైనా కష్టాలు వచ్చినపుడు తట్టుకోవడం చాల కష్టం.
         సుఖం ఉన్న చోట మనిషికి విలువ  ఉండదు.సుఖం అంటే ప్రస్తుతం చేతి నిండా డబ్బు ఉండటమే అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది.డబ్బు అవసరం లేని మనిషి ఉండదు.అదే పద్దతిని దేవుడికి అంట గట్టేస్తున్న్రు. ఈ రోజుల్లో దైవ దర్శనం కూడా డబ్బుతోనే ముడి పది ఉంది.అమాయుకులైన చిన్న పిల్లలు సహితం ఒక్క రూపాయి ఇస్తేనే  మనతో సంతోషం పంచడానికి ముందుకు వస్తారు .ప్రపంచం అంత పొట్ట కుతి కోసం కోటి విద్యలు నేర్చారు అనేకంటే డబ్బు సంపాదించడానికే కోటి విద్యలు నేర్చారు అనడం లో అతిషేయోక్తి లేదు .డబ్బు లేని వానికి ఆకలి ఎక్కువ డబ్బులున్న వాడికి అసలు తినే సమయం తక్కువ .ఎంత విచిత్రం ఇక్కడ కోటి విద్యలకు ,కూటి ఆకలికి ఎంత సంభందం ఉంది?
        డబ్బు లేని వానికి కష్టాలు ఎక్కువ సుఖం తక్కువ .ప్రతి రోజు ఉన్న కోటి విద్యల్లో ఏదో ఒక విద్య ఉపయోగించి కష్టపడి ,పొట్ట నిండా తినకున్న సుఖంగా నిద్రపోగాల్డు.నిద్ర విషయం లో డబ్బు లేని వానికే సుఖం ఎక్కువ .డబ్బు ఉన్న వానికి ప్రతి రోజు ఈ రోజు డబ్బులెలా వస్తాయి అనే ఆలోచన ఉండదు కాని తినడానికి సమయం ఉండదు.సుఖంగా జీవించడానికి అన్ని సదుపాయాలూ ఉంటాయి కానీ ఉన్న డబ్బు నే ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచన తో సుఖంగా నిద్ర పోలేడు,తిన లేడు.కష్టం దేవుడిచ్చిన శాపమా?సుఖం దేవుడిచ్చిన వరమా తేల్చడం కూడా మరో కష్టం .కాబట్టి సుఖం ఎంత ముఖ్యమో ,కష్టం కూడా అంతే ముఖ్యం.ఎప్పుడు సుఖాలు ఉంటె కష్టం వచ్చినపుడు తట్టుకోవడం వాళ్ళ కాక ఎలాంటి అఘాయిత్యానికైనా పాలపదతాడు మనిషి.కష్ట సుఖాలు రెండు జీవితం లో అవసరమే.
 


 

కామెంట్‌లు లేవు: