21, డిసెంబర్ 2009, సోమవారం

తెలంగాణా కావాలా?it's the time for decision

తెలంగాణా కావాలా?
---it's the time for decision


ప్రజలారా మీ కు కావాలా సమైఖ్యాంద్ర ? కావాలను కునే వారు చేతులెత్తండి .చేతులేత్తించే వారు ఉన్నంత వరకు చేతులేత్తు తుంటారు గొర్రె జనాలు. ఎవరి ఉద్యమం వారిది ఇష్టం వచ్చినట్లు తిండి అరగక దీక్షలు. ఎవరిదీ న్యాయ పోరాటం అని అర్థం చేసుకునే తెలివి లేదా? తెలుగు మాట్లాడితే తెలుగు వారు అంత ఒకటేనా? మరి తెలంగాణా వారు మాట్లాడేది తెలుగు కాదని మీరే అంటారు కదా మరి ఎందుకీ రభస? కోట్లు కాపాడు కోవడానికి దీక్షలు అవసరమా? కోటీశ్వరులు చేసే ఈ దీక్ష నిజమైనా దేనా? దొంగ లా దొంగ బుద్ది చూపించి పారిపోయే వారు చేసేది నిజమైనా ఉద్యమమా?
సమైఖ్య "ఆంధ్ర" ఉద్యమం చేసేది వివక్షతోనే చేస్తున్నారు .అదేదో తెలుగు వాళ్ళ సమైఖ్యత ఉద్యమ అని పెట్టుకోవాచు కదా.ఇక్కడ కూడా ఆంధ్ర తెలివి తేటలు చూపించారు. అయినా మీ అందురులు ఇంకా సమైఖ్యంగానే ఉన్నారు కదా ? సీమంధ్ర కావాలని చేయండి పోరాటం. తెలంగానని వదిలేయండి. మొదలు పెట్టిన ఉద్యమాలు "జై ఆంధ్ర ", గ్రేటర్ రాయల సీమ అని .కాని ఇప్పుడు జరుగుతుంది సమైఖ్య "ఆంధ్ర" అని అంటున్నారు ఆంధ్రులు దీనికి తెలివి తక్కువ గ సీమ వాళ్ళు వంత పాడుతున్నారు .తెలంగాణా ఏర్పడితే ఆంధ్రులతో కలిసి ఉండమన్న సీమ వారు ఇప్పుడు ఆంధ్ర పాలకులు చేసే కుటిల రాజనీతికి దాసోహం అయ్యారు . ఒక్క సారి ఆంధ్ర వాళ్ళని అడిగి చుడండి ,తెలంగాణా ఏర్పడితే మీ తో కలిసి ఉంటామంటే ఆంధ్రులు ఏమంటారో చూడండి.ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉండదు .

ఇంకెన్నాళ్ళు అమాయకుల చేసి బొజ్జ నిమ్పుకుంటారో మరి ఈ ఆంధ్రా పాలకులు.సంపాదించి బొంద మీద వేసుకొని పోతారేమో ? ఈ ఆంధ్ర పాలకులు . మాట మార్చే ఉసర వెళ్లి రాజ కీయ కుతంత్రాలకు గొర్రెల్లా మారిన ప్రజలను చూస్తే జాలి వేస్తుంది.తెలంగాణా ఉద్యమం ఈ నాటిది కాదని తెలిసి , చిన్న పిల్లాడి మనస్తత్వం లా నాకు చందమామ కావాలని అన్నట్టు .మేము ఇంకా తెలంగాణా వారితో కలిసే ఉంటామని, వారినుండి దోచుకుంది ఇంకా చాల లేదని సమైఖ్య "ఆంధ్ర" ఉద్యమం తేరా పైకి తెచ్చారు .ఇంకెన్నాళ్ళు తయారు గ ఉన్న సంపదని కొల్ల గొడతారు? మీకంటూ సదుపాయాలూ వద్ద? ఈ రోజు సద్దు మనిగినట్లనిపించినా మల్లి ఎప్పటికైనా ఈ ఉద్యమం ఆ గడు. మీ వైద్యం కోసం ఇంకా తెలంగాణా ఆసుపత్రుల మీద ఆధార పడుతున్నారంటే మీకే సిగ్గు చేటు.
ఈ ఉద్యమం లోను సీమ వారు అనే మాట ఇంతకు ముందు అన్నదే .తెలంగాణా కంటే సీమ వారు వెనుక పది ఉన్నారని .అయినా సమైఖ్య"ఆంధ్ర" కావాలని .వారు ఒక విషయం ఎందుకు అర్థం చేసుకోరు ? ఇన్నాళ్ళు ఉన్నది సమైఖ్యంగానే కదా అయినా వెనకపడే ఉంది కదా?ఇంకా సమైఖ్య వాదమే కావాలని కోరు కుంటు న్నారంటే వారికి అభివృద్ధి అవసరం లేదా?
తెలంగాణా ఇప్పుడు రాష్ట్రంగా మారితే వచ్చే నష్టం ఏమిటి ? ఆంధ్ర ,సీమ వారు ఎందుకు అంత దిగిలు చెందుతున్నారు? ఒక వేల కష్ట ,నష్టాలు వచ్చినా ఇన్నాళ్ళు పడిన కష్టం కంటే అది ఎక్కువేమి కాదు.ఇప్పుడు పడే కష్టమేదో అప్పుడు పడతం .తెలంగాణా ని ప్రపంచం చెప్పుకో స్థాయిలో అభివృద్ధి చేస్తాం .సామాజిక తెలంగాణా కావాలి, బంగారు తెలంగాణా కావాలి అని చిలుక పలుకులు పలికే నాయకులు అది వచ్చే సమయానికి ఎందుకు అడ్డు తగులుతున్నారో?
జగ మెరిగిన సత్య మేమంటే ఆంధ్ర పాలకులు బాగా గడించారనేది .అది ఎలా సంపాదించారో కూడా అందరికి తెలుసు .ఇప్పుడు ఆంధ్ర పాలకుల వదనాళ్ళ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాద్ ని అభివృద్ధి మేమే చేసాం అని. ఆ అభివృద్ధి హైదరాబాద్ ని కాదు వాళ్ళని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి అని తెలుసుకోలేమా? ఒక వేల హైదరాబాద్ ని అభివృద్ధి చేసుంటే కోటీశ్వరులు అయింది ఎవరు? ఒక వేల అభివృద్ధి చేస్తే ,అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ ఒక్కటే ఉందా? ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకా ప్రదేశాలు లేవా? విషపు నీళ్ళు తాగుతూ, హైదరాబాద్ కి మంచినీరి,గుంటూరు కి సేద్యపు నీరు అందిస్తేనే కదా అభివృద్ధి చెందింది? ఒకరి కి ఘోరి కడుతూ ఇంకొకరు డబ్బు సంపాదిస్తే అది అభివ్రుద్దియ?
సంవత్సరానికి మూడు పంటలు మా నీటి తో పండించి మాకే ఎగ నామమ? కరెంటు కష్టాలు,కన్నీటి వ్యధలు ఇక్కడ ,చేపల పులుసులు ,పూత రేకులు అక్కడ .రాజధాని కాబట్టి హైదరాబాద్ ని అభివృద్ధి చేశామంటే పది జిల్లాల తెలంగాణా రాబడి ఎక్కడికి వెళ్తుంది? ఎవరు దోచేస్తున్నారు? హైదరాబాద్ ని అభివృద్ధి చేసామని మీరు భావిస్తే ఇంకా ఇక్కడ మురికి వాదాలు ఎందుకు మిగిలి ఉన్నాయి? దుర్గందపు ముసి నది ఎందుకు ప్రవహిస్తుంది ?

ఆంధ్ర,సీమ ప్రజలకు విన్నవించేది ఒక్కటే ,తెలంగాణా వస్తే మీకు వచ్చే నష్టమేమి లేదు .మిమ్మల్ని ఎవరు ఏమి అనరు .ఆదరణలో అమ్మ ప్రేమ కన్నా గొప్పది తెలంగాణా అది మీకు తెలుసు.అక్కున చేర్చుకుని అన్నం పెడితే ,మా నోట్లో దుమ్ము పోసే ప్రయతనం మానుకోండి.

కామెంట్‌లు లేవు: