19, సెప్టెంబర్ 2009, శనివారం

నీవు వస్తావని

అన్ని నీతో కోరుకుని అన్నినీతో కావాలనుకుని
జీవితం నీతో నే అంతం కావాలనుకుని
దేవుణ్ణి దీనంగా వేడుకున్న
దేవుని దీవెన దక్కలేదు.
నా దేవతా నాకు దక్కలేదు
మరుపు రావు మధుర క్షణాలు
మారలేదు నా మనసు
ఇంకా ఏదో ఆశ
వరంగా నీవు వస్తావని

3, ఆగస్టు 2009, సోమవారం

అమ్మాయి జోలికి వెళ్లొద్దు జాగర్త

అందరికి విన్నపం.అమ్మాయిల జోలికి వెళ్ళకండి జీవితాన్ని పాడు చేసుకోకండి .ఈ మధ్య జరిగిన సంఘటనలు ఒక సారి చూసినట్లయితే అమ్మాయిల గొంతు కోయడము ,ఆమ్లముతో దాడి చేయడము ,కత్తి తో పొడవడము జరుగుతున్నాయి .ప్రతి సారి అబ్బాయే నేరస్తుడుగా శిక్షించ బడుతున్నాడు.అదే సమయాన అమ్మాయి అబ్బాయి చేతిలో శిక్షించ బడుతుంది.
ప్రస్తు త సమాజం అమ్మాయి వైపే ఉంది .కొన్ని ఉదాహరణ గా ,(నిజాలను) తీసుకుంటే ఒక అబ్బాయి, అమ్మాయికి ప్రేమ ను తెలియ పరచాడు అమ్మాయికి ఇష్టం ఉంటే గొడవ లేదు .ఇష్టం లేదనుకో అప్పుడే ప్రాబ్లం.మనం ఎంత చేసినా సమాజం దృష్టి లో అమ్మాయి వెంట పడడం.ఈ విషయం అమ్మాయి నీ పై కేసు పెట్టొచ్చు .కాని అదే అమ్మాయి ,అబ్బాయికి ప్రేమను తెలియ పరిచిన్దనుకోండి అబ్బాయికి ఇష్టం లేకున్నా మన వెంట పడితే మనం కేసు పెట్టె సౌలభ్యం లేదు.అమ్మాయి ప్రేమ ఒప్పుకోలేదని చని పోయే అబ్బాయిలే ఎక్కువ కాని ,అబ్బాయి ప్రేమ ఒప్పుకోలేదని చని పోయే అమ్మాయిలు ౦.౦% .ఉన్నా చాల తక్కువ .ఒక వేళ అమ్మాయి ప్రేమను అబ్బాయి ఒప్పుకోలేదని అమ్మాయి చని పోయినా అబ్బాయిని ఖైదు చేసే అవకాశమే ఎక్కువ .అదే అమ్మాయి వల్ల అబ్బాయి ప్రాణాలు తీసుకున్నా అమ్మాయికి జరిగే నష్టమేమి లేదు.
ఇక దాడుల విషయం చూస్తే నీ ప్రేమను ఒప్పుకోలేదని,నీకు దక్కట్లేదని దాడి చేస్తున్నారు కాని అలాంటి పరిస్థితి కలిపించినా అమ్మాయలదేమి తప్పు లేదంటారు సమాజంలోని పెద్దలు.అసలు దాడి చేయడం తప్పు నేను కూడా దీని వ్యతిరేకం. కాని అమ్మాయిలు కూడా ఆ పరిస్థితి కలిపించకూడదు.
అమ్మాయి చేత నీవు వ్యతిరేకించ బడినా, అమ్మాయి నిన్ను వ్యతిరేకించినా ,నీవు దాడి చేసి గాయ పరచిన (గాయం కొన్ని రోజుల్లో మానుతుంది, కాని నీవు మాత్రం జీవిత ఖైదు గా జైల్లో ఉంటావు).ఎలా అయినా ఎక్కువ నష్టపోయేది అబ్బాయిలే.
అందరు అబ్బాయిలు మోస గాళ్ళు అంటారు కాని అమ్మాయిలే నిజమైనా మోస గత్తేలు .మనం బహిరంగంగా చెప్పుకోలేము వాళ్లు చెప్పుకుంటారు. మనకు శిక్షించడానికే చట్టాలు,న్యాయ స్థానాలు .కాని వారికి శిక్షించడానికి లేవు ఎందుకంటే వాళ్ళని శిక్షించుకుంటూ పోతే భూమిపై ఉన్నా జైళ్ళు ,న్యాయ స్థానాలు సరిపోవు.అందుకే వాలని శిక్షించడానికి యమున్ని అధిపతిగా నియమించారు కాని యముని భార్యను కాదు.
బహిరంగంగా మనం ఒక అమ్మాయిని తదేకంగా చుస్తున్నమంటే దానికి కుడా కేసు పెట్టుకోవచు మనకు ఆ సౌలభ్యం లేదు. చూడు చూడు అని వాళ్ళంతా చూపించే బట్టలు వేసుకుంటారు(వేసుకోరు) చూస్తే నేమో కేసు అంటారు. రేప్ రేప్ అని మొత్చు కుంటారు.
ఇంతకీ నేను చెప్పలనుకున్దేమిటంటే కుక్క కాటుకు అయినా మందు ఉంది కాని అమ్మాయి కలవరం జీవితాంతం మానని రాచపుండు మందు ఉండదు.
సో జీవితాలను నాశనం చేసుకోకండి.
ప్రేమను మనము వ్యక్త పరిస్తే అమ్మాయిలు మనలను తమ చుట్టూ తిప్పించు కుంటారు.వాళ్ళకి ఇస్తమున్న సరే,అది వాళ్ల క్రూరత్వానికి నిదర్శనం .అదే అమ్మాయి ప్రేమను వ్యఖ పరిస్తే ఇష్టమా ,లేదా వెంటనీ చెప్పేస్తాం .అమ్మాయిలు తమ వెంట తిప్పించుకొని మన ప్రేమను అంగీకరిస్తారని నమ్మకం కూడా లేదు.ఇంట్లో వాళ్లు తిడతారని, నీకన్న మంచి సంబందమని చెయ్యిస్తారు.
అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని ప్రేమని మర్చి పోడు కాని అమ్మాయి మర్చి పోగలదు. మరుపు మార్పు అమ్మాయిల సహజ గుణం .రాయి నైనా కరిగించి ఒక రూపాన్ని తేగలం కాని అమ్మాయి హృదయాన్ని కరిగించి మన రూపాన్ని ముద్రించలేము .జీవ పరిణామ సిద్ధాంతానికి సరియిన రుజువు అమ్మాయి మనసు.తనకు నచినట్టు మారిపోతుంది ఎవరు ఎలా ,ఎటు పోయినా సరే ఎవరి జీవితం తో వారికి అవసరం ఉండదు.తన వల్ల ఒకరి జీవితం పాడవుతుందని తెలిసీ మనలను ఒంటరిగా చేసి పోతారు.
అమ్మాయిని గాని ,అబ్బాయిని గాని ప్రేమించాలంటే మొదట స్నేహం చేయాలి కాని ఇక్కడ మళ్లీ అబ్బాయే నిదించ బడు తున్నాడు.ఎలా అంటే ప్రేమనిచడానికి స్నేహం (పరిచయం) మొదట కావాల్సిందే ముక్కు మొఖం తెలియని వాళ్ళని అయితే ప్రేమించలేము కదా .అమ్మాయిలు ఈ స్నేహాన్ని ప్రేమగా త్వరగా అంగీకరించరు ప్రేమని వ్యక్త పరిస్తే నేను నీతో స్నేహం మాత్రమే చేశాను ప్రేమించలేదు అంటారు.అదే వారు స్నేహాన్ని ప్రేమగా మార్చు కోవలనుకుంటే వాళ్ళు చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు అదే ప్రయత్నాలు మనం చేస్తే కనీసం దాన్ని స్నేహంగా కూడా చూడరు .మనతో మాట్లాడారు.అంత వరకు స్నేహితులు అయి ఉండి ,ప్రేమిస్తున్నామని తెలిస్తే వెంటనే విరోదుల్లా చూస్తారు.అది వారి మనసుకున్న వికృత గుణం. స్నేహాన్ని ప్రేమగా అంగీకరించలేని వారు ,ఇంతకు ముందు స్నేహాన్ని కొనసాగించలేరు అమ్మాయిలు. మనం ఎంత ప్రయత్నించినా అర్థం చేసుకోరు. అదే వారు చేస్తే మళ్లీ మనతో స్నేహం కొనసాగించడానికి వెనుకాడరు .

5, జులై 2009, ఆదివారం

నేను నిన్ను ప్రేమించాను
నన్ను మించి నిన్ను ప్రేమించాను
గుడిలో దేవతలా ఆరాదించాను
దారి చూపే ఆత్మీయ నేస్తంలా పూజించాను
నీ తోనే జీవితాంతమని నమ్మాను
కలలో కూడ నాకు దూరం కావద్దని కోరుకున్నాను
కన్నీటిలో కరిగిపోవద్దని గుండెల్లో దాచుకున్నాను
కాని గుండెనే కరిగించి ,కన్నీటిని మిగిల్చి నాకు దూర మయ్యవు.

27, జూన్ 2009, శనివారం

నీ ప్రేమ నాకు ............

నా హృదయం లో నిన్ను దేవతగా ప్రతిష్టించి
నా మనసునుని నైవేద్యంగా అర్పించి
నీ ప్రేమ కోసం నిన్ను పూజిస్తున్నాను
నా పూజకు మెచ్చి ఆ దైవం వరం ఇస్తాడు కాని
నీ ప్రేమ నాకు దక్కకుంది

9, ఏప్రిల్ 2009, గురువారం

వివాహం

రాగాలపల్లకి ఎక్కి
జాణ నాకోసం వచ్చే శుభతరుణం
పాదాలను పన్నిటితో కడిగి
వందేళ్లు నాతో సహజీవనం చేసే తోడు దొరిక్రే ఆనంద సమయం
నింగి నేల ఉన్నంతవరకు ప్రేమనుపంచి
వివాహ బంధం తో జతకట్టే పవిత్ర ముహూర్తం
వారితో ఏడడుగులు వేసి
హంసతునికా తల్పం పై ఊరేగే ఉత్సవ సమయం
మురిపించండి మమ్ము మా పెళ్ళికి మీరాకతో

పెళ్లి ముహూర్తం

పెళ్లి చూపులతో మొదలైన ఈ పరిచయం

పెళ్లిగా మారే శుభ తరుణం

వేద మంత్రాలు మనస్సుని ఆహ్లాద పరిస్తే

వేయి కళ్ళ చూపులు మా కాపురాన్ని ఆహ్లాదంగా మారుస్తాయి.

మంగళ వాయిద్యాలు మాకు రాగాన్ని పంచితే

మంగళకరమైన మీ దీవెనలు మాకు అనురాగపు విలువ తెలుపుతాయి

కలిసి వేసే ఏడడుగులు జీవితానికి తొలి అడుగులైతే

కలిసి వచ్చే మీ అడుగులు కలకాలం మమ్ము కలిపి ఉంచుతాయి

నీ పెళ్లి కి

రాజసం ఉట్టిపడే నడకలో
రాణిలా నాతో నడిచి
రాజ్యమేలేను నా జీవితంతో
రావాలి సైన్యంలా మీ ఆశీర్వాద ఆయుధాలు అందించుటకు

11, ఫిబ్రవరి 2009, బుధవారం

వరం నాకు ప్రసాదించలేదు

చెలిమి అందించిన దేవుడు చెలిని అందించటం లేదు.
చేతిలో చేయివేసి నడిపించి చెయ్యి అందించటం లేదు.
చెప్పగలిగిన మాటలు చేతల్లో చేయ్యనీవటం లేదు.
చెదిరిపోని జ్ఞాపకాలు ఎన్ని ఉన్న చెంత ఉండే తోడు ఇవ్వటం లేదు.
చేయగలిగేది నేనైనా చేయించే నీ వరం నాకు ప్రసాదించలేదు

నీర జాక్షి నీవు నా దానివేనా

నీర జాక్షి నీవు నా దానివేనా ?
నీలో ఉన్నది నీనేనా?
నీకు జీవితం పంచగాలిగేనా?
నిన్ను నా దాన్ని చేసుకో గలనా?
నిన్ను వరియించి నీతో సహజీవనం చేయగలిగేనా?
నాలో ఈఊహలకు అంత మెప్పుడు?
నా ఈ ఆనందాన్ని సొంతం చేసేదెప్పుడు ?

ఎవరు నాకోసం

ఎదలో ఎవ్వరు లేరు నా కోసం
ఎప్పటికి రారు నాకోసం
ఈ పూట ఇరువురం
రేపటికి కావచ్చుఒక్కరం
నమ్మకమే లేదు నా ఆనందం లో
సగ భాగమెవ్వరికో
నాకు ఆశే లేదు నా జీవితం లో
తోడు ఎవ్వరికో
ఎవరు నా కోసం
నాకు నీనేనా నాకంటూ ఒకరున్నారా?

10, ఫిబ్రవరి 2009, మంగళవారం

గాయాన్ని మాన్పే శక్తి ఏది?

గాలి వానకు గాయ పడ్డ చిలుకమ్మ
గాయం తగిలింది మనసుకా, మనిషికా ?
గాయంలోతు ఎంతైనా మాన్పే హృదయం నీ దగ్గర లేదు
గాడి తప్పిన హృదయం గాలిలో కాగితమే
గోతిలోన పడునో, జ్ఞానాన్నే పంచునో
గాయం మానదు మాన్పే శక్తి నాకు లేదు

నిన్ను నీవు కష్ట పెట్టుకోకు

నిన్ను కూల్చే శక్తులు నీ పక్కనే ఉంటాయి
నిన్ను ముంచే దాక నిదరోకుంటాయి
నిన్ను జాగ్రత్త పరచే మీ మనసును చంపేస్తాయి
నిన్ను నడి సంద్రాన వదిలి నవ్వుకుంటాయి
నిన్ను నీవు కష్ట పెట్టు కోకు
నీ అదృష్టాన్ని వదులుకోకు.

18, జనవరి 2009, ఆదివారం

రాధిక నేను నీ కోసం

రాధేయ విధేయుడుగా నేను నీ కోసం
ధిక్కరించను నీ మాట నీ సంతోషం కోసం
కన్నీరు చిందించనీయను కలలోనైనా
నీలి కురులకు ముడి వేసుకుంటావో
కోరుకుని మరీ నీ గుండెల్లో దాచుకుంటావో
సంతసించి నీకు కనువిందు చేస్తాను
నేను నీలో సగ భాగ మవుతాను
నుదుట తిలకం దిద్ది కడదాకా తోడు ఉంటాను

10, డిసెంబర్ 2008, బుధవారం

నా వద్ద ఉండనంటు నా మనసుకేప్పుడు తొందరే
నా లాగా మనసును దాచుకునే వారు ఉంటారు కొందరే
నా మనసును బంధించక పోవడం నా పొరపాటే
నీకిచ్చాను స్థానం మనసులో నా మనసు కోరుకుంటే
మనషుల్లో పొరపొచ్చాలు కలగటం పరిపాటే
కాని మనసుని దూరం చేసుకోవడం గ్రహపాటే
తోడుఒకరు దొరికే వరకు చేస్తాము నిరీక్షణ
మంచి తోడు దొరికినా చూస్తాము పరీక్షగా
ఎన్నాళ్ళీ సాంప్రదాయమని ఎవరైనా అడిగితే
నీ ప్రేమకు పరీక్షా పెట్టి తేలుస్థామంటారు నీ ప్రేమ సంగతే
నా ప్రేమపై నమ్మకం లేదా అని అడిగితే
నీ ప్రేమను నమ్మే లేదంటారు తమ వద్దే తమ మనసే
ఇలాగైతే ప్రేముందో లేదో తెలుకునేదేలా అని నీవు అనుకుంటే
వేచి వేచి విరహ వేదన అనుభవించక తప్పదంతే

మాంగళ్యం తంతునా

మొదటి సారి నిన్ను చూసి మురిసిపోయాను.
మొన్నటివరకు ఒంటరినైన నేను నీతో కలిసిపోయాను
నా నయనాల్లో నిన్ను బంధించినాను
నా జీవితానికి తోడుగా ఆనందించినాను
ఎన్నాళ్ళు మనం మనసుల్లో దాగుందాం
ఎప్పటికి ఇక ఒకరికి ఒకరం అవుదాం
కాలం కలిసివస్తే కలిసుందాం కలకాలం
కాదంటే దూరం చేసిన కాలాన్ని నిందిద్దాం
దేవుడు రాసిఉంటే నా నుదుటన
దేనికి వెనుకాడను దిద్దుతా తిలకం నే నుదుటన
మాంగళ్యం తంతునామంత్రాలే చదివి
మాంగళ్యం ధారణ చేసి చేసుకుంటా నా అర్థాంగిగా

9, డిసెంబర్ 2008, మంగళవారం

ఏడు జన్మల తోడు

నిన్ను వెతికిన నా కనులు
నను మరచి పోయాయి
నీవు తప్ప నాకెవరు
కనిపించకున్నాయి
లోకమంతా నీవే అయినా
లోటు అయినది నీ ప్రేమే
కను సనుల్లో నిండిన నీవు
నా జీవితమంతా తోడుగా రాలేవా?
ఏడేడు లోకాల నిండిన ప్రేమ
ఏడు జన్మ లకు నీ తోడుని ఇవ్వలేవా

3, నవంబర్ 2008, సోమవారం

ఒంటరిని చేసావు

నీవు దూరమైన ,నన్ను దూరం చేసుకున్నా
నీపై అభిమానం ,నన్ను నీ దగ్గరే ఉంచింది
ఆనందాన్ని పంచి ,అభిమాన్నాన్ని చూపి
ఆపై నీ ప్రేమలో నన్ను మరిపించి
జంటగా మారి జోరుగా కాపురమే చేద్దామని
జీవితం లో నన్ను చూడనని
ఒక్కసారిగా నన్ను ఒంటరిని చేసావు

ఏదో పరవశం

నిన్ను తాకిన చిరు గాలి
నన్ను చేరగానే చిరుకోపం
తన్నుకు పోయింది
ఆనందాన్ని అందించి
అలసటను తీర్చింది
నీతో ఉన్నఈ క్షణం
నాలో ఏదో పరవశం

మిగిలేది శూన్యం

నయ వంచన చేసి
నన్ను వదిలి వెళ్ళావు
నిన్నే నమ్ముకుని
నేను మోస పోయాను
ఎవ్వరికి చోటివ్వనని
నీకు మాట ఇచ్చాను
ఎన్నటికి నిను వీడనని
నీతో బాస చేశాను
ఇక నుండి ఒంటరిదే ఈ జీవితం
ఇక నా గుండెల్లో మిగిలేది శూన్యం

నన్ను చంపు

ఇన్నాళ్ళు నిన్ను దాచిన నా హృదయం
ఇక నీవు తనలో లేవని
ఎప్పటికి తిరిగి రావేమోనని
ఎదురుచుడలేక
ఎప్పుడు ఆగిపోతుందో ఏమో ?
కరుణించి నను కాపాడు
కాదంటే నీవే నన్ను చంపు