14, ఫిబ్రవరి 2011, సోమవారం

విద్య -- ఇది ఒక మిధ్య

విద్య నేర్చని వాడు వింత పశువు అన్నాడో పెద్ద మనిషి .ఎందుకంటే విద్య నేర్చిన వాడికి జ్ఞానం కలుగుతుంది.ఒక నాడు గురువుకు సేవ జేసి విద్యనభ్యసించే వారు .నేడు విద్యార్ధి ముందుకు గురువు వచ్చి చెప్పినా వినే స్థితిలో లో విద్యార్థి లేడు.ఒక నాడు విద్య జ్ఞాన సముపార్జనకు ఎంత దోహదం చేసిందో ,ఇప్పుడు అదే విద్య ద్వారా నేర్చిన విజ్ఞానం మనిషి అస్థిరతకు అంత దోహదం చేస్తుంది.విద్యా ప్రమాణాలకి నెలవైన పాటశాలలు ,కళాశాలలు కనీస ప్రమాణాలకు నోచు కోవడం లేదు.విద్య నేర్పే గురువులు కనీస ప్రయత్నం చేయడం లేదు. విద్య నైపుణ్యం ఉన్న వారు విద్య పంచేందుకు బద్దకిస్తున్నారు నైపుణ్యం లేని వారు పిల్ల ల జీవితాలని బలి చేస్తున్నారు.ప్రాధమిక విద్య లో నేర్పిన బుద్దులు కళాశాల దశకు చేరే సరికి బ్రష్టు పట్టి పోతున్నై .జ్ఞాన భండారాలైన పుస్తకాల చదివే శ్రద్ద కనిపిచడం లేదు.ప్రాదమిక పాటశాలలో పాటించిన నియమాలు,సంప్రదాయాలు కళాశాలకు చేరుకునే సరికి మారి పోతున్నై .వందేమాతర జాతీయ గీతలపంతో మార్మోగే పాటశాల విద్యా దశ, గురుభో నమః అంటూ ప్రారంబించే తరగతులు ,స్వాతంత్ర్య గణతంత్ర్య దినోత్సవాలలో కనిపించే పోటీతత్వం అంత కళాశాల విద్య వచ్చే సరికి మంట కలిసి పోతున్నై .మంచి నడత నేర్పే గురువులకు విద్యార్ధి దృష్టిలో ఎప్పటికి చిరస్మరణీయుడు.
     కళాశాల విద్య కత్తి మీద సాము లాంటిది .కళాశాల విద్యలో గురువుకి గురువే గొప్ప అనుకుంటాడు .విద్యార్థికి విధ్యార్దే గొప్ప అనుకుంటాడు .గురువు ఎలా చెబుతున్నాడో ,ఏమి చెబుతున్నాడో విద్యార్థికి అవసరం లేదు.విద్యార్ధి ఎలా చదువుతున్నాడో గురువుకి అవసరం లేదు.నా దృష్టిలో విద్య లో ఎంత ఎత్తుకు ఎదిగిన గురువు స్థానం గురువుదే శిష్యుడి స్థానం శిష్యుడిదే .మహనీయుల గొప్పదనం మార్మోగిన చెవుల్లో ఒక్క సారిగా ఏదో మార్పు.గురువు చెప్పేదే వేదంగా పరిగణించే తెలివి నేర్చిన బుర్రలు అతి తెలివిని ప్రదర్శిస్తాయి .ఎంతో మార్పు సంభవిస్తుంది .ఎంతో తెలివిగల విద్యార్థి అథః పాతాళానికి కురుకు పోతాడు అథః పాతళం లో ఉన్న విధ్యర్హి అనూహ్యంగా అభివృద్ధి సాధిస్తాడు .
 మొదటి దశలో అహర్నిశం ప్రాధమిక విద్యా పద్దతులు అవలంబిస్తాడు .విద్యార్థి అవగాహన రాహిత్యం గురుశిష్యుల సమన్వయ లోపం తో అసలు సమస్య మొదలవుతుంది .ఈ నాటి విద్యా ప్రమాణాలు ఏ  విధంగా ఉన్నాయంటే మూలల నుండి ఆలోచిస్తే 1 టవ తరగతిలో తల్లి దండ్రులు తెలుగు మాద్యమమ ఆంగ్ల మాధ్యమమా? అనే సందేహం తో మొదలై 10 వ తరగతి కి వచ్చాక గనితమా?సామన్య శాస్త్రమా? అనే రెంటికే పరిమిత మవుతుంది ఆలోచించే వారు ముగ్గురవుతారు .అందరు కేంద్రీకరించిన వైద్యం (medicine), సాంకేతిక విద్య (engineering) లో ఏదో ఒకటి నిర్ణయించుకుంటారు .ఆ నిర్ణయం తీసుకున్నాక సమస్యల వలయం లో అడుగుపెడతారు (ఇంజనీరింగ్ /మెడికల్ కాలేజీ ) .అందరి దృష్టి ఈ రెండింటి మీదనే ఉన్నప్పుడు ఇటు వైపే ఆకర్షితులవుతారు .కాని ఆ ఆకర్షణకి తగిన ప్రమాణాలు పాటించే కళాశాలలు చాల అరుదు. ఈ సమస్యా నిలయాల్లో కావాల్సింది గురు శిష్యుల మిశ్రమ అధ్యయనం ,శోధన. కాని అవేమి జరగవు .నిమిషాల్లో కనీస ప్రాధమిక సమాచారం అందించే వెసలుబాటు ,సాంకేతిక పరిజ్ఞానం ,సౌలభ్యాలు ఇన్ని ఉన్నా ,ఇంత అభివృద్ధి జరిగినా గురువు చేసే పని గురువు చేయదు,శిష్యుడు చేసే పని శిష్యుడు చేయడు.గురువు చెప్పలేదని శిష్యుడు ప్రయత్నించడు.శిష్యుడు ప్రయత్నించాలి అని గురువు చెప్పడు.
      శోదించే పరిజ్ఞానం  లేని రోజుల్లో  పరిశోధనలు  ఎన్నో జరిగాయి శోదించే పరిజ్ఞానం అర చేతిలో ఇమిడి ఉన్న పరిశోధనలు జరగడం లేదు .ఎన్నో సమస్యల నిలయాల్లో కనీస సౌకర్యాలు ,నేర్పు కలిగిన అధ్యాపక బృందం కొరత ఒక కారణం అయితే ,అవినీతికి అలవాటు పడ్డ అధికారులు అడ్డగోలుగా ఇచ్చిన అనుమతులతో పుట్ట గొడుగుల్లా పెరిగిన సమస్యానిలయాలు మరొక కారణం .వీళ్ళ అవినీతి వల్ల సరస్వతీ నిలయాలు సమస్యా నిలయాలు గ మారుతున్నాయ్.ఇక పోతే ఈ సమస్యల నిలయాల్లో విద్యా ప్రమాణాలు ,గురుశిష్యుల అనుభందాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది .గురువు పాఠాలు చెప్పే పద్దతినుండి విద్యార్థి పరీక్షలు రాసి గణాంకాలు ఇచ్చే  వరకు అన్నీ  విద్యార్థికి అనుకూలంగా నడిస్తేనే విద్యార్థి దృష్టిలో గురువు మంచి వాడు.గురువు కి విసుగోచ్చినా పాఠాలు జరగవు విద్యార్థికి విసుగోచ్చినా పాఠాలు జరగవు .పరీక్షలు రాయరు. కనీసం ప్రాథమిక అంశాలు తెలియ కుండా దొంగ దారిలో ఉత్తీర్ణుడై  ఒక విద్యార్థి బయటి ప్రపంచానికి వచ్చి మనిషి అస్త్తిరతకు  ఎంతో దోహదం చేస్తున్నాడు. సాంకేతిక విద్య నేర్చిన విద్యార్ధి ఈ నాడు ఏ మోతాదులో ఏ పరమాణువులు కలిస్తే ఏ పదార్ధం ఏర్పడుతుందో చెప్పలేని స్థితిలో ఉన్నాడు.ఏ నాడి ఎక్కడుందో తెలియని వైద్యుడి గా ఉన్నాడు.ఏ మందు ఎందుకు ఇవ్వాలో తెలియని మందుల కంపెనీ లో ఉద్యోగిగా ఉన్నాడు.ఏ చట్టం ఎందుకు పనికి వస్తుందో తెలియని న్యాయ వాదిగా ఉన్నాడు .కావున మనిషికి మున్ముందు సాంకేతిక పరంగా ,వైద్య పరంగా, ఆరోగ్య పరంగా ,న్యాయ పరంగా అన్నీ అవరోధాలే ,ప్రతికూల పరిస్తుతులే .

 కావునా విద్యార్థీ మేలుకో -------- నిజమైన గురువు ఎవరో తెలుసుకో
గురువు మేలుకో --------------- విద్య నీ బాధ్యత గుర్తుంచుకో
యాజమాన్యం మేలుకో --------- గురువు,విద్యార్థులకు న్యాయం నిర్వర్తించుకో
ప్రభుత్వమా మేలుకో --------- అవినీతి అధికారులకు కొమ్ము కాయడం మానుకో





కామెంట్‌లు లేవు: